Bachchala Malli review and rating:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ : బచ్చల మల్లి (అల్లరి నరేష్) తన తండ్రి సత్య నారాయణ (బలగం జయరామ్) రెండో పెళ్లి చేసుకున్నారన్న ఆవేదనతో… మూర్ఖుడైన వ్యక్తిగా తయారవుతాడు. అంతేకాదు చదువులు ఎప్పుడు టాపర్ గా ఉండే ఇతను.. ఆ సంఘటన తర్వాత పూర్తిగా చదువును దూరం చేసుకుంటాడు. చెడు అలవాట్లు, చెడు ప్రవర్తనలతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, మొరటుడిగా మారతాడు. తినడం, తాగడం, పనికి వెళ్ళకపోవడం, ఎదురు వచ్చిన వారితో గొడవలు పడడం అతని రోజువారీ జీవితం అవుతుంది.  


ఇంతలో మల్లిగాడి జీవితంలోకి కావేరి (అమృతా అయ్యర్) ప్రవేశిస్తుంది. ఆమె రాకతో మల్లిలో కొంత మార్పు కనిపిస్తుంది. అయితే, ఆ మార్పు చాలా కాలం నిలవదు. మళ్లీ మల్లి పాత అలవాట్లలోకి జారిపోతాడు.. తాగుడుకు బానిసగా మారి తన జీవితాన్ని గాడి తప్పించుకుంటాడు.  అయితే ఎందుకు మళ్లీ అలా తయారయ్యారు. అతని మార్పుకు కారణమైన కావేరి పాత్ర చివరకు ఏమవుతుంది? హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీ నారాయణ (రావు రమేష్), గణపతి రాజు (అచ్యుత్ కుమార్) పాత్రల ప్రాముఖ్యత ఏమిటి? అనేదే ఈ కథ  మిగతా భాగం.  


నటినటుల పర్ఫామెన్స్.. టెక్నికల్ సిబ్బంది పనితీరు:


అల్లరి నరేష్‌ను బచ్చల మల్లి పాత్ర మరో కొత్త కోణంలో చూపించింది . ఈ పాత్రలో ఆయన యాక్టింగ్ ఎంతో సహజంగా, ఒప్పించేలా ఉంటుంది. మొరటోడు, మూర్ఖుడిగా నటనలో అల్లరి నరేష్ అద్భుతంగా మెప్పించాడు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లోనూ తన ప్రతిభను చూపించాడు.  అమృతా అయ్యర్‌కు కథలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. తల్లి పాత్రలో రోహిణి ప్రదర్శన సాధారణంగా అనిపించినప్పటికీ, రావు రమేష్ పాత్ర క్లైమాక్స్‌లో బాగా పండింది. అచ్యుత్ కుమార్ విలన్‌గా పెద్దగా ప్రభావం చూపించలేకపోయినా, బలగం జయరామ్ తండ్రిగా భావోద్వేగాల్ని చాలా చక్కగా అందించారు. హరితేజ నటన కొన్ని సందర్భాల్లో అతి అని అనిపించినా, ప్రవీణ్, అంకిత్ కొయ్య, వైవా హర్ష, ప్రసాద్ బెహరా వంటి నటులు తమ పాత్రలలో మెప్పించారు.  


ఇక టెక్నికల్ సిబ్బంది పని తీరుకు వస్తే.. విజువల్స్, ఆర్ట్ వర్క్ సహజంగా ఉండి, పీరియాడిక్ చిత్రానికి అవసరమైన షాట్స్ చాలా బాగా తీశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం వినసొంపుగా ఉండగా, ఆర్ఆర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 


విశ్లేషణ :


మల్లి చిన్ననాటి కష్టాలను చూపించడంతో కథ ప్రారంభం అవుతుంది. కానీ, ఈ కథను కొత్త కోణంలో చూపించడానికి దర్శకుడి ప్రయత్నం విఫలమైంది. ప్రతి సన్నివేశం మనకు ఎక్కడో ఒక దగ్గర చూసిన లానే అనిపిస్తది. ముఖ్యంగా ఎక్కడా కూడా మనకు కొత్తదనం కనిపించదు. ప్రేమ కథ తగిన భావోద్వేగాలు లేకపోవడం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేయలేదు. ప్రేమ కథ చాలా ఎమోషనల్ గా ఉండి ఉంటే.. ఈ సినిమా లెవెల్ వేరుగా ఉండేది. కానీ ఎక్కడా కూడా ఆ ప్రేమ కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం.. కథ పెట్టగా లేకపోవడం.. ఈ సినిమాకి పెద్ద మైనస్లుగా నిలిచాయి. విలన్ పాత్ర కూడా నిరాశ కలిగిస్తుంది.


తన కోపమే తన శత్రువు అని చాలామంది చెప్పుతారు. మూర్ఖతతో జీవించేవారు మంచి చెడును అర్ధం చేసుకోలేరు. వారు ఎవరైనా చెప్పిన మాటను వినరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అందరినీ కోల్పోయిన తరువాత..వారి జీవితాలు ఏమిటో అర్థం అవుతుంది. ఇది స్పష్టంగా దర్శకుడు సుబ్బు ఈ సినిమాలో చెప్పాలనుకున్న విషయం.  బంధాలను నిలుపుకోవడం కంటే వదిలేయడం చాలా సులభమని ఈ కథ చూపిస్తుంది.


కొన్ని తప్పుల్ని మనం సరిచేయగలిగినా, కొన్ని తప్పులు మన జీవితంలో మనం కోలుకోలేని స్థితికి తీసుకువెళతాయి. ‘బచ్చల మల్లి’ కథలో, ప్రధాన పాత్ర తన తప్పులతో ఎలా తనకు, తన చుట్టూ ఉన్న వారికీ నష్టాన్ని తెచ్చుకుంటాడో చూపిస్తారు. జీవితంలో పట్టూ విడుపులు ఉంటేనే మనం జీవించగలుగుతాం అని తెలియజేస్తారు.. తినడానికి ఈ పాయింట్ ఎంతో చక్కగా ఉన్న.. డైరెక్టర్ రాసుకున్న కథ, దాన్ని స్క్రీన్ పైన చూపించిన విధానం మాత్రం ఎక్కడో మంచి మార్క్ మిస్సయింది. ఇంకొన్ని ఎమోషన్స్ స్పందించి ఉంటే ఈ సినిమా.. మరింత బాగుందేమో. 


తీర్పు: 


దర్శకుడు చెప్పాలనుకున్న మెసేజ్ ఎంతో అద్భుతమైనది.. కానీ కథలో ఆ అద్భుతం మిస్సయింది..


Rating: 2.25/5


Also Read: Pending DAs: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. పెండింగ్‌ డీఏలపై అసెంబ్లీలో చర్చ


Also Read: New Year 2025: న్యూ ఇయర్‌ వేడుకలకు పోలీసుల షాక్‌.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter