Telangana Employees DAs: తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు రావాల్సిన డియర్‌నెస్ అలవెన్స్ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ పెండింగ్ డీఏలపై శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగింది. మొత్తం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండగా ఒక డీఏ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. మిగిలిన నాలుగు డీఏల విషయమై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ నిలదీసింది. ఉద్యోగులకు డీఏలు ఇప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించింది.
Also Read: New Year 2025: న్యూ ఇయర్ వేడుకలకు పోలీసుల షాక్.. రాచకొండ పరిధిలో తీవ్ర ఆంక్షలు
అసెంబ్లీలో బుధవారం జరిగిన సమావేశాల చర్చలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఇరుకునపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. బకాయిపడిన నాలుగు డీఏలు త్వరలగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కూడా ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి సంవత్సరం గడిచినా ఇవ్వలేదని గుర్తు చేశారు. వెంటనే వేతన సంఘం కూడా అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
Also Read: Matrimony Cheating: బట్టతల.. బారెడు పొట్టతో 50 మంది అమ్మాయిలను మోసం.. బాసూ నీవు గ్రేటూ
ఉద్యోగుల ఆరోగ్య పథకం అన్ లిమిటెడ్‌గా చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ సభ్యులు హరీశ్ రావు కోరారు. 'ప్రభుత్వ ఉద్యోగుల కోరిక మేరకు మేం అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్య పథకంపై నిర్ణయం తీసుకున్నాం. నియమ నిబంధనలు కూడా రూపకల్పన చేశాం. వాటిని అమలు చేయాలని కోరుతున్నా' అని హరీశ్ రావు తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పింఛన్ బెనిఫిట్స్ రాక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్ బెనిఫిట్స్ కూడా పరిష్కరించాలని కోరుతున్నా అని మాజీ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న మోసాలను అసెంబ్లీలో హరీశ్ రావు ప్రస్తావించారు.
ఉద్యోగ సమస్యలపై బీఆర్‌ఎస్ దృస్టి
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే తేదీన జీతం ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు? అంటూ హరీశ్ రావు గతంలో వేరే సభలో ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. రేవంత్ రెడ్డి చెప్పిన మోసకారి మాటలు నమ్మిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇప్పుడు దగా పడ్డారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుందని గుర్తుచేస్తోంది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా తమ పెండింగ్ డీఏలు, పీఆర్సీపై అసెంబ్లీలో చర్చ జరగడంతో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు హర్షిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో తమ సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కదలిక వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.