New Year 2025 Celebrations: కాల గర్భంలో మరో సంవత్సరం కలిసిపోనుండడం.. కొత్త సంవత్సరం వస్తుండడంతో భారీగా ప్రణాళికలు వేసుకుంటున్న ప్రజలకు పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. న్యూ ఇయర్ వేడుకలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీసులు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన విడుదల చేశారు. వాటిలో అనేక విషయాలపై ఆంక్షలు విధించడంతో ప్రజలు విస్తుపోతున్నారు.
Also Read: Matrimony Cheating: బట్టతల.. బారెడు పొట్టతో 50 మంది అమ్మాయిలను మోసం.. బాసూ నీవు గ్రేటూ
సంతోషంగా.. ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనేది తమ ఉద్దేశమని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. డ్రగ్స్ వినియోగం మీద ఉక్కు పాదం మోపుతామని.. మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఔట్ డోర్ ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పబ్‌లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్‌లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కమిషనర్ దిశానిర్దేశం చేశారు.
Also Read: Love Fraud: లవ్ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'
రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు విజ్ఞపతి చేశారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. డ్రగ్స్, మద్యం విక్రయాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి విషయాలపై కీలక సూచనలు చేశారు. ఈవెంట్‌లో టపాసులు, మందుగుండు సామగ్రి అనుమతించవద్దని నిర్వాహకులకు సూచించారు. రోడ్డు భద్రత, ఈవ్ టీజింగ్‌ల నివారణ, బాంబుదాడుల నిరోధం, సంఘ వ్యతిరేక చర్యలను నిరోధించడంపై దృష్టి సారించి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక షీ టీమ్‌లు ఈవెంట్‌లకు హాజరవ్వాలని, ఈవ్-టీజర్‌లపై నిఘా ఉంచాలని పోలీస్ సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు.
'ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలి. ట్రాఫిక్ పోలీసు సూచనలకు అనుగుణంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎక్సైజ్ చట్టం ప్రకారం మైనర్లకు మద్యం అందించకూడదు. ఉల్లంఘించే వారి మీద సరఫరాదారుతో సహా నిర్వాహకులపై సంబంధిత కేసులు నమోదు చేస్తాం' అని కమిషనర్ సుధీర్ బాబు చెప్పారు. 'ఫామ్ హౌస్‌లు, పబ్‌ల లోపల అన్ని ఈవెంట్‌లు నిర్ణీత సమయానికి ముగించాలి' అని స్పష్టం చేశారు. బార్ అండ్ రెస్టారెంట్‌లు కూడా నిర్ణీత నిబంధనలను పాటించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.