Bad News to Sudigali Sudheer Fans: తెలుగు ప్రేక్షకులకు అసలు పరిచయమే అక్కర్లేని పేరు సుడిగాలి సుధీర్. సుధీర్ అనే పేరుతో జబర్దస్త్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తరువాత కాలంలో తన కామెడీ టైమింగ్ తో ఏకంగా ఒక టీం లీడర్ స్థాయికి చేరుకున్నాడు. సుడిగాలి సుధీర్ పేరుతో తెలుగు ప్రేక్షకులు అందరికీ దగ్గరయ్యాడు. చాలా కాలం నుంచి ఈటీవీ ప్రేక్షకులకు బాగా నోటెడ్ అయిపోయిన సుడిగాలి సుధీర్ తాను చేస్తున్న మల్లెమాల షోల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమాలలో వరుస అవకాశాలు రావడంతో పాటు మరో చానల్లో ఒక సింగింగ్ షోలో అవకాశం రావడమే కాక మల్లెమాల సంస్థ ఇస్తున్న పారితోషకం కంటే అది రెట్టింపు కావడంతో ఎట్టకేలకు తన స్నేహ బంధానికి, మల్లెమాలకు గుడ్ బై చెప్పి స్టార్ మాలో మెరుస్తున్నాడు. అయితే ఆయన ఇక ఎప్పటికీ ఈటీవీలో కనిపించకపోవచ్చు అని అందరూ భావించారు. కానీ ఈటీవీ 27వ వార్షికోత్సవం సందర్భంగా సుడిగాలి సుధీర్ ఈటీవీ ఏర్పాటు చేసిన ఒక స్పెషల్ షోలో మెరిశాడు.


కేవలం సుడిగాలి సుధీర్ ఒక్కడే కాదు మల్లెమాలకు గుడ్ బై చెప్పి వేరే చానల్స్ అలాగే సినిమాలు చేస్తున్న చమ్మక్ చంద్ర, అనసూయ సహా మరికొందరు కమెడియన్స్ కూడా ఈ 27వ వార్షికోత్సవ స్పెషల్ ఎపిసోడ్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో ఇక వారంతా వెనక్కి తిరిగి వచ్చారంటూ అందరూ భావించారు. ఈ ఎపిసోడ్ మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఆదివారంనాడు దాని టెలికాస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఈటీవీ యాజమాన్యం.


అయితే సుడిగాలి సుధీర్ మళ్లీ వెనక్కి వచ్చేస్తాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది నిజం కాదని తెలుస్తోంది. సుడిగాలి సుధీర్ ప్రస్తుతం స్టార్ మాతో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆయన కేవలం అతిథిగా మాత్రమే ఇతర టీవీ షోలలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ పూర్తిస్థాయిలో షోలలో పాల్గొనడం కుదరదట. దీంతో ఆయన ఈ 27 యియర్స్ స్పెషల్ ఎపిసోడ్లో మాత్రమే ఆయన కను విందు చేయనున్నాడు. ఆ తరువాత ఆయన ఈటీవీలో కనిపించకపోవచ్చు అని అంచనాలు వెలువడుతున్నాయి. ఇలాగే ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం ఉండి నిర్వాహకులు సుధీర్ ను కనుక ఆహ్వానిస్తే ఆయన మళ్ళీ ఈటీవీలో కనపడే అవకాశాలు ఉన్నాయి, కానీ పూర్తిస్థాయిలో కనపడడం అనేది అసాధ్యం అని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరగనుంది అనేది. 


Also Read: Sri Reddy Targets Puri Jagannadh: బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా?


Also Read: Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి