Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!

Liger Movie to release on OTT Platform Disney+ Hotstar. లైగ‌ర్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 25, 2022, 04:56 PM IST
  • ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు లైగర్‌
  • ఓటీటీలో 'లైగర్‌'
  • ఎప్పుడు, ఎందులోనో తెలుసా
Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!

Vijay Deverakonda's Liger Movie to release on Disney+ Hotstar: గ‌త నెల‌ రోజుల నుంచి దేశ‌వ్యాప్తంగా యువ‌త‌రానికి 'లైగ‌ర్' మేనియా పట్టుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు న‌గ‌రాల్లో ప్ర‌మోష‌నల్ ఈవెంట్స్‌లో పాల్గొన్న‌ చిత్ర బృందానికి అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు యువ‌త‌రంలో ఉన్న క్రేజ్ ఏంటో ప్ర‌చార కార్య‌క్ర‌మాల ద్వారా స్పష్టంగా తెలిసొచ్చింది. ఎన్నో అంచనాల మధ్య నేడు (ఆగష్టు 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది లైగర్‌ సినిమా. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. 

లైగ‌ర్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీతో పాటుగా అన్ని భాషల డిజిటల్ రైట్స్ ని డిస్నీ+ హాట్‌స్టార్ భారీ మొత్తానికి కైవసం చేసుకుంది. లైగ‌ర్ సినిమా దాదాపు 50 రోజులు తర్వాతే ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ తొలి వారంలో ఈ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే లైగ‌ర్ సినిమా మిశ్రమ స్పందన రావడంతో నెల రోజుల తర్వాత వచ్చినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌,  విజయ్‌ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన సినిమా 'లైగర్‌'. కరణ్‌ జోహార్‌, ఛార్మి, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించారు. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో దేవరకొండ.. ముంబై మురికివాడకు చెందిన చాయ్‌ వాలాగా కనిపించాడు. విజయ్‌కు తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించారు. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషించారు.

Also Read: ఈ టెక్నిక్‌లు అనుసరిస్తే.. 13 అడుగుల కింగ్ కోబ్రా కూడా ఏమీ చేయలేదు!

Also Read: How To Weight Gain: ఇలా చేస్తే మీరు అనుకున్నంత బరువు పెరగడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News