Sri Reddy Targets Puri Jagannadh: బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా?

Sri Reddy Criticises Puri Jagannadh over Liger Movie Result: పూరీ జగన్నాద్ ను టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి . ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2022, 05:18 PM IST
Sri Reddy Targets Puri Jagannadh: బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా?

Sri Reddy Criticises Puri Jagannadh over Liger Movie Result: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే, ఏమాత్రం బాలేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మీద కాస్తో కూస్తో కోపం ఉన్న సెలబ్రిటీలు సైతం తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే అనసూయ భరద్వాజ్, విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినట్టు చెబుతున్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆమె విజయ్ దేవరకొండ పేరు గాని లైగర్ సినిమా పేరు కానీ ఎక్కడ ప్రస్తావించలేదు కానీ గతంలో వారిద్దరికీ జరిగిన వాగ్వాదాల నేపథ్యంలో ఆమె విజయ్ దేవరకొండ గురించే కామెంట్ చేసింది అనే వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా శ్రీరెడ్డి కూడా పూరి జగన్నాథ్ ను ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది.

‘’తీసేది ఏమో అట్టర్ ఫ్లాప్ సినిమాలు, మరలా మహేష్ బాబు గారు డేట్స్ ఇవ్వడం లేదు, అని బాబు మీద పడి ఏడవడం, ఎంత వరకు కరెక్ట్ అధ్యక్షా? అంటూ కామెంట్ చేశారు. గతంలో పూరి జగన్నాథ్ మహేష్ బాబు హిట్స్ కొట్టిన డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలు ఇస్తారని ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్లకు ఆయన అవకాశాలు ఇవ్వరు అంటూ కామెంట్లు చేశారు. వాటిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి ఆయనకు ఘాటు కౌంటర్ ఇచ్చింది.

అంతేగాక ‘’లైగర్ కి ముందు లైగర్ తర్వాత అంట, అనవసరమైన హైప్ లు అవసరమా, కంటెంట్ ఉన్నోడికి హైప్ అవసరం లేదు, లైగర్ కన్నా కార్తికేయ 2 బెటర్, బెటర్ కూడా కాదు కార్తికేయ 2 ఒక అద్భుతం’’ అంటూ కార్తికేయ 2 సినిమాని లైగర్ సినిమాతో పోలుస్తూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఈ కామెంట్ల మీద పెద్ద ఎత్తున విమర్శలు వర్షం కురిపిస్తున్నారు విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ అభిమానులు. ముందు నీ సంగతి చూసుకుని తర్వాత మా హీరో, డైరెక్టర్ ని కామెంట్ చేద్దువు గాని అంటూ ఆమెను టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ అలాగే పూరి జగన్నాథ్ లైగర్ సినిమా గురించి చేసిన కామెంట్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయి అని చెప్పక తప్పదు.
 Also Read: Liger OTT: ఓటీటీలో విజయ్‌ దేవరకొండ 'లైగర్‌'.. ఎప్పుడు, ఎందులోనో తెలుసా!

Also Read: Anasuya Bharadwaj on Liger: అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ తప్పదంటూ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News