Ramya Krishnan will host the upcoming episodes of Bigg Boss Tamil Season 5: హీరోయిన్​గా ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా దూసుకుపోతున్న నటి రమ్యకృష్ణ. బాహుబలి తర్వాత ఆమెకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు (Bahubali Actress Ramya Krishnan) దక్కింది. దీనితో అమె వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ బిజీగా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు టీవీ షోల్లో సైతం అమె చురుగ్గా పాల్గొంటుంటారు. కాగా ఇప్పుడు మరోసారి భారీ షోకు హోస్ట్​గా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళ బిగ్​ బాస్​ షోను.. రమ్యకృష్ణ ముందుకు నడిపించనున్నట్లు (Ramya Krishna To Host Tamil Bigg boss) తెలుస్తోంది.


కమల్​కు కరోనా..


ఇప్పటి వరకు ఈ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్​ (Kamal Haasan) ఇటీవల కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలిసింది.


అయితే చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కమల్ క్వారంటైన్​లో ఉన్న కారణంగా.. బిగ్​ బాస్​ షూటింగ్​కు (Bigg boss 5) రాలేకపోతున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలోనే కమల్ స్థానంలో రమ్యకృష్టను హోస్ట్​గా పెట్టాలని షో నిర్వాహకులు భావిస్తున్నారని కోలీవుడ్ వర్గాల టాక్​. ఈ విషయంపై షో నిర్వహాకులు రమ్యకృష్ణను సంప్రదించగా.. అమె ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ వారాంతంలోనే అమె షూటింగ్​కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై నిర్వాహకుల నుంచి గానీ, రమ్యకృష్ణ నుంచి గానీ ఎలాంటి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


రమ్యకృష్ణ ఇంతకు ముందు తెలుగు బిగ్​ బాస్​-4కు హోస్ట్​గా చేసి మెప్పించారి. నాగార్జున సినిమా షూటింగ్​లో బిజీగా ఉండటం వల్ల ఓ సారి రమ్యకృష్ణ, మరోసారి సమంత హోస్ట్​గా వ్యవహరించారు.


Also read: Karthikeya Tirumala Visit: తిరుమల శ్రీవారి సేవలో హీరో కార్తికేయ దంపతులు.. ఫొటోలు వైరల్


శృతి హాసన్​పైనా అంచనాలు..


కమల్​కు కొవిడ్ సోకిన తర్వాత.. బిగ్ బాస్​ హోస్ట్​గా ఆయన కూతురు సృతి హాసన్ చేసే అవకాశాలు ఉన్నాయని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ఆనూహ్యంగా ఇప్పుడు రమ్యకృష్ణ పేరు తెరపైకి వచ్చింది.


Also read: SS Rajamouli: పునీత్‌ రాజ్‌కుమార్‌ అలాంటివాడు కాదు.. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు: రాజమౌళి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook