Bahubali Part 3: బాహుబలి హీరో ప్రభాస్..అప్‌కమింగ్ సినిమా రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి మూడవ భాగం ఉంటుందో లేదో చెప్పేశాడు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాన్ ఇండియా నటుడిగా ఎదిగిన డార్లింగ్ ప్రభాస్..అప్‌కమింగ్ సినిమా రాధేశ్యామ్ మార్చ్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్..ఇప్పుడు పూజాహెగ్డేతో కలిసి రాధేశ్యామ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్ పనిలో పూజాతో కలిసి బిజీగా తిరుగుతున్నాడు. సినిమా ప్రమోషన్ సందర్భంగా కొన్ని కీలకమైన అంశాల్ని షేర్ చేసుకున్నాడు మీడియాతో. అదే సమయంలో బాహబలి మూడవ భాగం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. అప్పుడే బాహుబలి విడుదలై నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ సినిమా మూడవ భాగం వస్తుందా లేదా అనే సందేహం ప్రతిఒక్కరిలో ఉంది.


రాజమౌళితో ఎప్పుడూ తాను సినిమాల గురించి చర్చించనని ప్రభాస్ చెప్పాడు. రోజూ మాట్లాడుకున్నా సినిమా ఎప్పుడు తీసేది అడగనన్నాడు. బాహుబలి సమయంలో కూడా ఎప్పుడూ ఎవరి సినిమాల గురించి చర్చించలేదన్నాడు. అదే సమయంలో బాహుబలి 3 తీసే ఉద్దేశ్యం రాజమౌళితో పాటు నిర్మాత యార్లగడ్డ శోభుకు ఉందన్నాడు. బాహుబలి సినిమా ఆ ఇద్దరినీ వదిలే ప్రసక్తే లేదన్నాడు. దీపికా పదుకోన్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే గురించి ప్రభాస్ కొన్ని అప్‌డేట్స్ అందించాడు. దీపికా పదుకోన్‌తో ప్రారంభంలో ఇద్దరూ సిగ్గు పడేవాళ్లమని చెప్పాడు. ఆ తరువాత క్రమంగా సాన్నిహిత్యం పెరిగిందన్నాడు.


Also read: Radhe Shyam Promotion: రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో బిజీగా పూజాహెగ్డే, ప్రభాస్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook