మనో..హరీ అంటూ పాటతో హల్‌చల్ చేసిన బాహుబలి ముద్దుగుమ్మ మధు స్నేహ గుర్తుందా. ఒక్కపాటతో దేశమంతా ఆకర్షించిన స్నేహ ఇప్పుడేం చేస్తోంది. భారీగా సినిమా అవకాశాలు వచ్చాయా లేదా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాహుబలి సినిమా(Bahubai Movie)ప్రపంచవ్యాప్తంగా ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఎవర్‌గ్రీన్ సాంగ్‌గా నిల్చిన పాట మనోహరీ పాట(Manohari Song). మనో..హరీ అంటూ ముగ్గురు ముద్దుగుమ్మలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ ముగ్గురు ముద్దుగుమ్మల్లో మస్తుగా అందర్నీ ఆకర్షించింది మధుస్నేహ. ఈ ఒక్క పాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మెరిసి..ఆ వెంటనే కనుమరుగైన భామల్లో ఒకరిగా నిల్చిపోయింది ఈమె. ఆ పాట అంతగా ప్రాచుర్యం పొందినా ఎందుకో మరి సినిమా అవకాశాలు రాలేదు. 


కోల్‌కత్తాలో పుట్టి..ముంబైలో పెరిగిన మధుస్నేహ(Madhusneha) చిన్ననాటే తల్లిదండ్రులకు తెలియకుండా ఆడిషన్స్‌కు వెళ్లి తన్నులు తిన్నదట. చదువు పూర్తి చేయాలని గట్టిగా చెప్పడంలో డగ్రీ పట్టా సాధించుకుంది. నటిగా స్టిరపడాలనే లక్ష్యంతో మోడలింగ్ చేస్తూ అడిషన్స్‌కు హాజరయ్యేది. వచ్చిన మొదటి అవకాశంతోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది 2015లో బాహుబలి ది బిగినింగ్ సినిమాలో మనో..హరీ అంటూ తెగ హల్‌చల్ చేసింది. అయితే ఆ తరువాత సినిమా అవకాశాలు రాకపోవడంతో చేసేది లేక వెబ్ సిరీస్‌లో ప్రవేశించింది. ఇప్పుడు వెబ్‌లో సందడి చేస్తోంది పలు యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా మారింది. 2018లో ది ఎట్సెట్రాస్ అనే కామెజీ వెబ్ సిరీస్‌తో పాపులర్ అయింది. 


Also read: Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ స్టేజ్‌పై శ్రీహాన్...సిరి వదిలేస్తున్నావా అంటూ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook