Balagam Fame Mogilaiah health condition critical: ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్గా నిలిచిన సినిమాల్లో బలగం సినిమా ఒకటి. కమెడియన్ వేణు దర్శకుడిగా మారి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా కావ్య కళ్యాణ్రామ్ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి కొత్త ప్రొడక్షన్ సంస్థ ఏర్పాటు చేసి ఈ సినిమాని నిర్మించారు. తెలంగాణలోని పిట్ట ముట్టుడు సంప్రదాయం చుట్టూ అల్లుకున్న ఒక కథతో ఈ సినిమాను తెరకెక్కించగా సినిమా సూపర్ హిట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా థియేటర్లో ఇంకా సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అంటే ఈ సినిమాని ఇంటిల్లిపాది థియేటర్లకు వెళ్లి చూసేందుకు ఎంతలా ఆసక్తి చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే విధంగా అనేక ప్రాంతాలలో ఈ సినిమాని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ఇంటిల్లిపాది మాత్రమే కాదు ఊరు అందరూ కలిసి చూస్తున్నారు. ఇక ఈ సినిమా చివరి 15 నిమిషాలు చూసిన అందరికీ కంటతడి తెప్పిస్తుంది. అందులో ఒక పాట పాడిన మొగిలయ్య అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది.


Also Read: Samyuktha Menon Photos: బ్లూ డ్రెస్సులో అప్సరసలా మెరుస్తోన్న సంయుక్త మీనన్.. అదిరే ఎద అందాల జాతర!


స్వతహాగా బుర్రకథలు చెబుతూ ఫేమస్ అయిన మొగిలయ్య వరంగల్ జిల్లా వాసి. ఆయన ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతానికి వరంగల్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మొగిలయ్యను హైదరాబాద్ తరలించాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా వెల్లడవుతోంది, ఇప్పటికీ ఆయనకు రెండు కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని వారానికి మూడుసార్లు ఆయనకు డయాలసిస్ చేస్తున్నారని తెలుస్తోంది.


ఇక తన భర్తకు ప్రభుత్వం తరఫున వైద్య సహాయం అందించి తమ కుటుంబానికి అండగా ఉండాలని, ఆదుకోవాలని ఆయన భార్య కొమరమ్మ విజ్ఞప్తి చేస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య, కొమరమ్మ దంపతులు ఇద్దరు బుర్రకథలు చెబుతూ పొట్టపోసుకొనేవారు వారిని చూసిన తర్వాత వారు చెప్పిన బుర్రకథకు ఫిదా అయిన దర్శకుడు వేణు తన సినిమాలో వారిచేత క్లైమాక్స్ లో పాట పాడించి అందరి మనసులను మెలిపెట్టేశారు. మొగిలయ్య ఆరోగ్యం కోలుకోవాలని బలగం సినిమా చూసిన ప్రేక్షకులు సైతం కోరుకుంటున్నారు. 
Also Read: Alekhya Harika Photos: ఘాటైన అందాలతో తెలంగాణ మిర్చి అలేఖ్య హారిక.. కవ్విస్తూ చంపేస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook