Balakrishna Fans Arrested : నందమూరి బాలకృష్ణ అభిమానులకు పోలీసులు షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తంలో తెలుగు వారు ఉన్న చోట ఈ సినిమా పెద్ద ఎత్తున విడుదలైంది. సినిమా మొదటి ఆట నుంచే ఈ నుంచి సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం అయితే మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో బాలకృష్ణ అభిమానులు ఒక అడుగు ముందుకు వేశారు. తణుకులో లక్ష్మీ థియేటర్ దగ్గర గొర్రెపోతుని నందమూరి బాలకృష్ణ కటౌట్ ముందు బలి ఇచ్చి సినిమా సూపర్ హిట్ కావాలని వారంతా కోరుకున్నారు. అయితే ఇలా జంతుబలులకు సంబంధించి వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం చేయడంతో జంతు బలి ఇచ్చిన పది మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తణుకుకు చెందిన మట్ట వెంకట్, నల్లూరి సురేష్, పల్లూరి సురేంద్రనాథ్, షేక్ ఆరిఫ్,నందమూరి కేశవ, హర్ష, బట్టపల్లి నాగరాజు, పోలాటి రవికృష్ణ, గెడ్డం శీను అనే వ్యక్తుల మీద కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ కి తరలించినట్లు తణుకు సీఐ ముత్యాల సత్యనారాయణ వెల్లడించారు.


తమ అభిమాన హీరో సినిమా ఎలా అయినా సూపర్ హిట్ కావాలని కొందరు అభిమానులు గొర్రెను సినిమా హాల్ గేటు వద్ద బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిపై జంతు ప్రేమికుల కొందరు జంతు సంరక్షణ చట్టాల ప్రకారం తణుకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని అంటున్నారు. అభిమానం చూపించే విధానాలు చట్ట వ్యతిరేకంగా ఉండకూడదని పలువురు చెబుతున్నా వినకుండా అత్యుత్సాహానికి పోయి ఇలా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు.


వాస్తవానికి మేక, గొర్రె, కోడి, చేపలు, రొయ్యలు, పీతలు లాంటివి మానవుడు ఆహారంగా తినేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఎలాగో తింటున్నాం కదా అని వాటిని ఎలా పడితే అలా క్రూరంగా లాక్కు వెళ్లడం, హింసించడం, బహిరంగ ప్రదేశాలలో బలి ఇవ్వడం, నరకడం లాంటివి చట్టరీత్యా నేరం. పాపం ఈ విషయం తెలియక బాలయ్య అభిమానులు ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
Also Read: AP Govt Focus: 'వీర సింహారెడ్డి'పై ఏపీ ప్రభుత్వం ఫోకస్.. స్పెసల్ షో చూసిన అధికారులు!


Also Read: Chiranjeevi Jarumitaya: చిరంజీవి నోట జంబలకిడి జారు మిఠాయా.. మంచు విష్ణు రియాక్షన్ ఏంటో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook