Chiranjeevi Jarumitaya: చిరంజీవి నోట జంబలకిడి జారు మిఠాయా.. మంచు విష్ణు రియాక్షన్ ఏంటో?

Megastar Chiranjeevi Jambalakidi Jarumitaya: గత ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన సాంగ్స్ లో జంబలకిడి జారు మిఠాయి అనే సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాను ఆలపించడం హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 13, 2023, 09:49 AM IST
Chiranjeevi Jarumitaya: చిరంజీవి నోట జంబలకిడి జారు మిఠాయా.. మంచు విష్ణు రియాక్షన్ ఏంటో?

Megastar Chiranjeevi Sings Jambalakidi Jarumitaya: గత ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన సాంగ్స్ లో జంబలకిడి జారు మిఠాయి అనే సాంగ్ ఒకటి. మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా తెరకెక్కిన జిన్నా సినిమా కోసం చిత్తూరు ప్రాంతంలో పాడుకునే ఈ జంబలకిడి జారు మిఠాయి అనే ఒక జానపదాన్ని ఎంచుకొని దాన్ని కాస్త మ్యూజిక్ టచ్ తో వేరే ట్యూన్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఆ సాంగ్ అంత ఆకట్టుకోలేదు కానీ జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సాంగ్ ఒరిజినల్ గా పాడిన ఇద్దరు మహిళలను తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. అందులో ఒక మహిళ ఈ జంబలకడి జారు మిఠాయి సాంగ్ పాడింది. నేను చీర కడతాను చూడు నేను చీర కడతాను చూడు ఆ చీర సాయి చూడకుంటే తీసేస్తా చూడు అంటూ ఆమె పాడిన ఆ జానపదం వింతగా ఉండడంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. దీంతో ఈ జంబలకడి జారు మిఠాయి అనే పదం కూడా వెంటనే వైరల్ అయిపోయింది.

ఈ జంబలకిడి అనే పదానికి అర్థం తెలియకపోయినా దీన్ని అందరూ వాడేస్తున్నారు. అయితే ఇప్పుడు దీన్ని మెగాస్టార్ హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా వాడేయడం ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమా జనవరి 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్ పాడినట్లుగా తెలుస్తోంది.

అయితే ఒరిజినల్ గా చీర గురించి పాట ఉంటుంది కానీ ఆయన మాత్రం లుంగీ గురించి పాట పాడినట్టుగా తెలుస్తోంది. నా లుంగీ తీసేస్తా చూడు తీసేస్తా చూడు జంబలకిడి జారు మిఠాయి అంటూ ఆయన పాడడం హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మంచు విష్ణు జిన్నా సినిమా కంటే ఈ జంబలకిడి జారు మిఠాయి అనే పదమే ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. దీని మీద ఒక సినిమా తీసేనా తీసేయచ్చు ఏమో అనేంతలా ఆ పదానికి క్రేజ్ ఏర్పడింది. అయినా సరే మంచు మోహన్ బాబు కుమారుడు సినిమాకి సంబంధించిన పాటను మెగాస్టార్ హమ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. 

Also Read: Waltair Veerayya Review: వాల్తేరు వీరయ్య మూవీ రివ్యూ.. పూనకాలు తెప్పించిన మెగా-మాస్!

Also Read: Waltair Veerayya Twitter Review : వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్స్ కేక అంతే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News