Balakrishna Fires: నిర్మాతలను కసురుకున్న బాలకృష్ణ.. అసలు ఏమైందంటే?
Balakrishna Fires on Producers: నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన సినిమా నిర్మాతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Balakrishna Fires on Producers: నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నందమూరి తారకరామారావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పరుచుకున్నాడు. ఒకరకంగా అన్ స్టాప్ అవర్ షో ముందు వరకు బాలకృష్ణ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండేవి కానీ ఒక్కసారిగా ఆ షో ద్వారా ఆయన మంచి పాజిటివిటీ తెచ్చుకున్నాడు.
అయితే ఆయనను నిర్మాతలు హీరో అని కూడా పిలుస్తూ ఉంటారు, నిర్మాతలు ఎలా చెబితే అలా చేస్తారని, ఎలాంటి గ్యాప్ లేకుండా వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసే హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరిగా ఉంటారని అంటూ ఉంటారు. అయితే అలాంటి బాలకృష్ణ షూటింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగిన నిర్మాతలు మీద ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు పెడదామని నిర్మాతలు బాలకృష్ణను అప్రోచ్ అవ్వగా ఆయన వారి మీద కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఆయన అలా చేయడానికి ఒక కారణం ఉందని అంటున్నారు. అదేమిటి అంటే బాలయ్య ప్రస్తుతం తన సోదరుని కుమారుడు తారకరత్న ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న గురించి ఎక్కువసేపు సమయం వెచ్చించి డాక్టర్లతో మాట్లాడుతూ ఆయన్ని ఇక్కడి నుంచి విదేశాలకు షిఫ్ట్ చేయాలా వద్దా అనే విషయాల మీద సమాలోచన చేస్తున్నారు. అందుకే ఇప్పుడు అప్పుడే సినిమా షూటింగులు వద్దు అని భావించి ఆయన షూటింగ్ వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది ఆ ప్రకారం టీం అంతా రెడీ చేసుకున్నారు. కానీ బాలకృష్ణ రాకపోవడంతో ఆయనని సంప్రదించారట మీరు ఎప్పటి నుంచి వస్తారో చెబితే షూటింగ్ అప్పటినుంచి పెట్టుకుంటామని అంటే ప్రస్తుతం తానేమీ చెప్పలేనని ఆయన చెప్పినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాతలు మరోసారి అడిగే ప్రయత్నం చేయగా ఆయన ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది నిజమా కాదా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ఆయన కుమార్తెగా శ్రీ లీల నటిస్తోంది.
Also Read: Sukesh legal notice: బాలీవుడ్ నటికి సుకేష్ 100 కోట్ల పరువు నష్టం దావా
Also Read: Naatu Naatu Step: ఆనంద్ మహీంద్రాతో కలిసి నాటు నాటు స్టెప్పేసిన రామ్ చరణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook