Bandla Ganesh: ఫిలిం జర్నలిస్టుపై బండ్ల గణేష్ దారుణ ట్వీట్లు.. ఒక రేంజ్ లో రెచ్చిపోయి!
Bandla Ganesh Targetting a Journalist : ఒక ఫిలిం జర్నలిస్టును టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
Bandla Ganesh Back to Back Tweets Targetting a Journalist Became Viral: ఎప్పటికప్పుడు వివాదాస్పద ట్వీట్లు చేస్తూ ఉండే బండ్ల గణేష్ తాజాగా ఒక ఫిలిం జర్నలిస్ట్ ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి మీడియా వ్యక్తులను మరియు ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులను ఎవరు టార్గెట్ చేయాలని అనుకోరు కానీ బండ్ల గణేష్ ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ను టార్గెట్ చేస్తూ చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
సదరు సీనియర్ జర్నలిస్ట్ తన పేరుతో కాకుండా ఒక అమ్మాయి పేరుతో అకౌంట్ మైంటైన్ చేస్తూ ఉండడంతో దాన్ని కూడా ప్రస్తావిస్తూ బండ్ల గణేష్ అనేక ట్వీట్లు చేశారు. ఈరోజు హీరో నిఖిల్ తో ఇంటర్వ్యూ చేస్తున్నట్లు సదరు ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొనగా కేవలం నువ్వంటే భయంతో ఇంటర్వ్యూ ఇస్తున్నారు లేకపోతే నీకు ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారా నీ మొహం నువ్వు అంటూ బండ్ల గణేష్ కామెంట్ చేశారు.
ఆ ట్వీట్ కు ఒకరు కామెంట్ చేస్తూ ఆయన ఎవరూ అని అడిగిన వారికి సమాధానంగా ఆయన పేరు మూర్తి అని దేవి ప్రియ అనే పేరుతో ట్వీట్ చేస్తూ ఉంటాడని ఆయన ఒక బ్రోకర్ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. ప్రతి హీరో పై ఆర్టికల్ రాస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు ఈ మూర్తి గాడు వీడిని అంటారు బ్రోకర్ అని అంటూ బండ్ల కామెంట్ చేశారు. ఆ మూర్తి గాడి ఫోటో ఉంటే పెట్టమంటే హిప్పోపొటామస్ సింబల్ పెట్టినా తరువాత అతని ఫోటో షేర్ చేశారు.
కళామతల్లి ముద్దుబిడ్డ చూసాం తల్లిని నిన్ను నమ్ముకొని ఎదిగిన వాళ్ళని చూసాం వీడు మాత్రం కళామతల్లి తల్లికి పుట్టిన చీడపురుగని పేర్కొన్నారు. అతను ఎవరో పరిచయం చేయమంటే బ్రోకర్ ని ఏమని పరిచయం చేయమంటావ్ సోదరా? బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు డబ్బు ఆడుక్కుంటూ ఉంటాడు దేవుడి పేరు చెప్పి అందర్నీ భయపెడుతున్నాడు, వాడి పేరే మూర్తి గాడని పేర్కొన్నారు. వీడే వీడే వీడే దొంగ మూర్తి గాడు బ్రోకర్ మూర్తి గాడు బ్లాక్ మెయిల్ గాడు, దీన్ని చేస్తా వైట్ మెయిల్ త్వరలో అని పేర్కొన్న బండ్ల పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నాం ఎందుకురా నీ బతుకు మూర్తి గా అంటూ ఘాటు కామెంట్లు చేశారు.
వీడు అందరి ని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు కార్లు ఫ్రిజ్ లో బట్టలు కళ్ళజోళ్ళు వాచీలు తీసుకోని బతుకుతుంటాడు, మా….గాడు అని ట్వీట్ చేసిన బండ్ల, నిన్ను త్వరగా భగవంతుడు ఈ సినిమా పరిశ్రమ నుంచి దూరంగా కానరాని లోకాలకు తీసుకెళ్ళి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మూర్తిగా అంటూ ట్వీట్ చేశారు.
మూర్తి దయచేసి భగవంతుడు పేరు వాడకు నిన్ను పుట్టించినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు, నీకు ఈఎంఐలు కట్టే నిర్మాత ఎవరో నాకు తెలుసు నీకు ఫోన్లు కొనిపెట్టే నిర్మాత ఎవరో నాకు తెలుసు, నీకు ఫ్లైట్ టికెట్ కొనే దర్శకుడు ఎవరో నాకు తెలుసు మూర్తిగా అని కూడా బండ్ల ట్వీట్ చేశారు. మొత్తం మీద ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Venkatesh: వెంకటేష్ విగ్గు రహస్యం బయటపెట్టిన మేకప్ మాన్..ఒక్కో విగ్గు అన్ని వేలా?
Also Read: Twitter Poll: లేపి తన్నించుకోవడమంటే ఇదే, ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చిన యూజర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook.మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి