Bandla Ganesh on TV Channel: ఛానల్ పై ఓపెన్ కామెంట్స్.. అడుక్కుతింటున్నారా? అంటూ ఘాటు కౌంటర్!
Bandla Ganesh Clarity on Launching a TV Channel : తాను న్యూస్ ఛానల్ పెట్టబోతున్నట్టుగా వచ్చిన వార్తలపై బండ్ల గణేష్ స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Bandla Ganesh Clarity on Launching a TV Channel : టాలీవుడ్ లో నటుడు, కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా అనేక సినిమాల్లో కనిపించినా ఆయన నిర్మాతగానే బాగా ఫేమస్ అయ్యారు/ నిర్మాతగా చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండే బండ్ల గణేష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ గురించి వినిపించిన అన్ని వార్తల మీద సదరు యూట్యూబ్ ఛానల్ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది.
ఈ సందర్భంగా గతంలో బండ్ల గణేష్ ఒక న్యూస్ ఛానల్ పెడుతున్నారు అంటూ వచ్చిన కథనాన్ని గురించి కూడా ప్రస్తావించారు. సదరు యాంకర్ న్యూస్ ఛానల్ పెడుతున్నారట కదా అంటే అవును డబ్బులు వచ్చే చోట వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పేముంది అని బండ్ల గణేష్ ప్రశ్నించారు. అయితే న్యూస్ ఛానల్ లో అంత లాభాలు వస్తున్నాయా అంటే మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ బండ్ల అక్కడికక్కడే కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
అయితే మీకు కోపం వస్తున్నట్లుంది అని యాంకర్ అనడంతో కోపం వస్తుంది రాకపోతే ఎలా అని బండ్ల ప్రశ్నిస్తారు. అయితే దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా అంటే సరే హద్దులు ఉంటే రాసివ్వండి, మర్డర్ చేస్తే ఇంతే కోపం రావాలి, మానభంగం చేస్తే ఇంతే కోపం రావాలి అని రాసివ్వమంటూ యాంకర్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను కూడా పంచుకున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ను బండ్ల గణేష్ తిట్టినట్లుగా గతంలో ఒక ఆడియో వైరల్ అవగా ఆ ఆడియో గురించి కూడా స్పందిస్తూ త్రివిక్రమ్ మీ తానే తిట్టినట్లుగా బండ్ల గణేష్ ఒప్పుకున్నారు.
ఇక అంతేకాక తనను ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బెదిరించినట్లు ప్రచారం జరగడంతో లైవ్ లోనే అనిల్ కుమార్ కి కాల్ చేసి అది నిజం కాదు అనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు బండ్ల గణేష్. ఇక బండ్ల గణేష్ తాజా ఇంటర్వ్యూ మాత్రం ఒకపక్క యూట్యూబ్ లో అలాగే మరో పక్క సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఆయన ఇంటర్వ్యూ మీద పలు రకాల ట్రోల్ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇక బండ్ల గణేష్ ఇటీవల ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఉపాధ్యక్ష పదవికి పోటీపడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవికి శివాజీ రాజా బరిలో ఉన్నారని తెలుసుకొని ఆయనను పోటీ నుంచి తప్పుకోమని కోరడమే గాక అలా తప్పుకున్నందుకు ఒక పేద కుటుంబానికి సహాయం చేస్తానని చెప్పి 5 లక్షల పదహారు వేల రూపాయలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నరేష్ అనే డ్రైవర్ కి ఇచ్చి ఒక్కసారిగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు.
Also Read: Bandla Ganesh Audio Leak : ఆ వాయిస్ నాదే.. త్రివిక్రమ్‌ని తిట్టింది నేనే.. ఒప్పేసుకున్న బండ్ల గణేష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook