God Father Pre Release Business: షాకింగ్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?

Chiranjeevi God Father Movie Pre Release Business Details  : మెగాస్టార్ చిరంజీకి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. వాటి మీద ఒక లుక్కు వేద్దాం పదండి.

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 3, 2022, 12:18 PM IST
  • షాకింగ్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్..
  • బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?
  • ఓటీటీకి కూడా భారీ రేటు
God Father Pre Release Business: షాకింగ్ గా గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్నికోట్లు రాబట్టాలంటే?

Chiranjeevi God Father Movie Pre Release Business Details  : ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు గాడ్ ఫాదర్ సినిమాతో వచ్చేస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన  లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేశారు. డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్షన్లో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, పూరి జగన్నాద్ వంటి వారు ఇతర కీలకపాత్రలలో నటించారు. ఆచార్య దెబ్బతో ఈ సినిమా మీద డిస్ట్రిబ్యూటర్లలో అనేక అనుమానాలు నెలకొన్నాయి. దానికి కారణం ఈ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటికే అమెజాన్ లో అందుబాటులో ఉంది, అయితే గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడంతో భారీగా అంచనాలు అయితే నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనే విషయం మీద కొన్ని లీకులు బయటకు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు నైజాం ప్రాంతంలో ఈ సినిమా 22 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

సీడెడ్ ప్రాంతంలో 13 కోట్ల యాభై లక్షలు, మిగిలిన ఆంధ్ర ప్రాంతంలో 35 కోట్లకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. అలా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల 50 లక్షల రూపాయలకు గాడ్ ఫాదర్ సినిమా హక్కులు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటకలో ఈ సినిమా ఆరు కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. హిందీ సహా మిగతా ప్రాంతంలో మరో ఆరు కోట్ల 50 లక్షల మేరకు హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా హక్కులు ఏడు కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన సినిమా ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 92 కోట్లు నిర్ణయించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. నెట్ఫ్లిక్ సంస్థ సుమారు 57 కోట్లకు ఈ సినిమా హక్కులు కొనుక్కున్నట్టు గతంలో ప్రచారం జరిగింది.

అంతేగాక శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఆ విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా ఆడియో రైట్స్ ని కూడా మంచి రేటుకి అమ్మినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక ఎమ్మెల్యే పాతలో కనిపించబోతున్నారు. అయితే ఆయనకి గతంలో మాఫియా లింకులు కూడా ఉండడం ఆసక్తికరంగా ఉంటుంది. అయితే మోహన్ లాల్ తో పోలుస్తూ చిరంజీవి మీద అనేక రకాలుగా ట్రోలింగ్ జరిగింది. కానీ పూర్తి సినిమా విడుదలైన తర్వాతే సినిమా మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం ఇదే కనిపిస్తుంది.

Also Read: Rajamouli Brother Kanchi Comments: పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి..పొన్నియన్, ఆదిపురుష్ లకు జక్కన్న బ్రదర్ కౌంటర్?

Also Read: Megastar Chiranjeevi Master Plan: తెలుగులో ఉన్న సినిమాని రీమేక్ చేయడానికి పిచ్చోళ్లేమీ కాదు.. మాస్టర్ ప్లాన్ వేరే ఉందండోయ్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News