Bandla Ganesh Politics : బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు వేశాడు. బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేది చెప్పలేం. అప్పుడే తన జీవితం ఇక సినిమాలే అని అంటాడు. అంతలోనే మళ్లీ రాజకీయాల మీద మనసు పడ్డట్టు చెబుతాడు. ఆల్రెడీ గత ఎన్నికల్లో బండ్ల గణేష్‌కు చుక్కలు కనిపించాయి. ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి అందరికీ శత్రువుగా మారాడు. ఇక రాజకీయాలు వద్దురా బాబోయ్ అని దండం పెట్టి వదిలేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కానీ ఆ మధ్య మళ్లీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు బండ్ల గణేష్ వేసిన ట్వీట్లు చూస్తుంటే.. ఇకపై శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండేందుకు నిశ్చయించుకున్నట్టు కనిపిస్తోంది. బండ్ల గణేష్ ఓ సారి రోజాను లైవ్‌లోనే దారుణంగా మాట్లాడాడు. ఇద్దరూ పర్సనల్ అటాక్ చేసుకున్నారు. ఆ లైవ్ వీడియోను జన సైనికులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.


 



రోజాకు బండ్లన్న అప్పుడే చుక్కలు చూపించాడు అంటూ ఆ వీడియోను వైరల్ చేయసాగారు. దీనిపై బండ్ల గణేష్ స్పందించాడు. రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను  నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు  అందరూ ఆత్మీయులే అని అన్నాడు. ఇక ఈ ట్వీట్‌ను చూసిన ఓ జన సైనికుడు ఇలా అన్నాడు. కోల్పోవడానికి సిద్దంగా ఉన్న వారే రాజకీయాల్లోకి రావాలి.. మన బాస్ పవన్ కళ్యాణ్‌లా అని అన్నాడు. దీనిపైనా బండ్ల గణేష్ స్పందించాడు. నాకంత స్థాయి లేదు   అంత గొప్ప వాన్ని కాదు సోదర అంటూ దండం పెట్టేశాడు.


Also Read : Naga Babu Daughter : నిహారిక కోసం అబద్దాలు చెబుతున్న నాగబాబు.. మెగా బ్రదర్ పోస్ట్ వైరల్


Also Read : The Kashmir Files సినిమాను కించపరిచిన జ్యూరీ మెంబర్.. క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook