Bandla Ganesh-pawan kalyan-hari hara veera mallu : బండ్ల గణేష్ ప్రేమైనా, కోపమైనా భరించడం కష్టంగానే ఉంటుంది. తనకు నచ్చిన వాళ్లను ఆకాశానికి ఎత్తేయడం, నచ్చని వాళ్లని పాతాళంలోకి తొక్కేసినట్టుగా మాట్లాడుతుంటాడు బండ్ల గణేష్. మెగా అభిమాని అయిన బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ భక్తుడిగానే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన బండ్ల గణేష్.. బడా నిర్మాతగా ఎదిగాడు. స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టేశాడు. అయితే బండ్ల గణేష్ చుట్టూ ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. బండ్ల గణేష్ ఆస్థులు, వ్యాపారాలు, బొత్సకు బినామీ అంటూ ఇలా నానా రకాలుగా కామెంట్లు వస్తూనే ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ, రాజకీయంగా బండ్ల గణేష్ మాటలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాకరేపుతుంటాయి. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసిన బండ్ల గణేష్ మాటలు కోటలు దాటేశాయి. పీక కోసుకుంటాను అని ఇలా అతిగా మాట్లాడాడు. చివరకు టీఆర్‌ఎస్ గెలుపుతో కాస్త సైలెంట్ అయ్యాడు. అయితే బండ్ల గణేష్ పొలిటికల్ జర్నీ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. బండ్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయాలనే ఉత్సుకతతో ఉన్నట్టు కనిపిస్తోంది.


మధ్యలో బండ్ల గణేష్ కొన్ని కామెంట్లు చేశాడు.. ఇంట్లో ఉండే పవన్ కళ్యాణ్ ఫోటోలను తీసేశాడు.. అక్కడ తల్లిదండ్రుల ఫోటోలను పెట్టేశాడు.. తల్లిదండ్రుల తరువాతే ఎవరైనా, మన కుటుంబం తరువాతే ఏదైనా అంటూ ఇలా కొత్తగా మాట్లాడాడు. దీంతో పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌కు చెడిందనే గాసిప్ బయటకు వచ్చింది. కానీ బండ్లన్న మాత్రం వాటిని ఖండిస్తూ ఉంటాడు. పవన్ కళ్యాణే తన దేవుడు అని చెబుతుంటాడు. పవన్ కళ్యాణ్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని బండ్లన్న గత కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తూనే ఉన్నాడు.


అయితే ఆ ప్రాజెక్ట్ ఉండదని ఈ మధ్యే అర్థమైంది. కానీ బండ్లన్నకు మాత్రం పవన్ కళ్యాణ్‌ చాన్స్ ఇస్తాడని, తప్పకుండా సినిమా తీస్తాను అనే ధీమా, నమ్మకం మాత్రం ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌ స్టిల్స్‌ను షేర్ చేశారు. ఆ ఫోటోలను బండ్లన్న చూసి షాక్ అయ్యాడు.


 



అబ్బబ్బ మా బాస్ ను చూస్తుంటే.. గుండెల్లో దడ దడ మొదలయ్యింది.. రక్తం ఉరకలేస్తుంది.. ఇప్పుడు ఒక్క చాన్స్ వస్తే.? వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా.. అబ్బ ముద్దొస్తున్నావ్..  బాస్ అంటూ పవన్ కళ్యాణ్ తన దేవుడి మీదున్న ప్రేమను చూపించేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.


Also Read : జాతీయ అవార్డులు.. జంటగా మెరిసిన సూర్య జ్యోతిక


Also Read : Sri Reddy : వాడికి అది తప్పా ఇంకేం రాదు.. దగ్గుబాటి అభిరామ్‌ గాలితీసేసిన శ్రీరెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.