suriya-jyothika-national awards 2020-soorarai pottru : సూర్య హీరోగా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగా అలరించాడో అందరికీ తెలిసిందే. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో అయితే సూరారైపొట్రూ (తెలుగులో ఆకాశం నీ హద్దురా) అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక రెండో లాక్డౌన్ సమయంలో జై భీమ్ అంటూ మెప్పించాడు. ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సూర్య ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు కూడా భారత్ తరుపున ఆస్కార్‌కు పంపించారు. కానీ చివరి పోరులో వెనక్కి వచ్చేశాయి. కానీ జాతీయ స్థాయిలో మాత్రం సూరారై పొట్రూ సినిమా అదరగొట్టేసింది. 2020లో విడుదలైన చిత్రాల్లో ఆకాశం నీ హద్దురా అదరగొట్టేసింది.
జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడిగా, ఉత్తమ నిర్మాతగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇలా పలు కేటగిరీల్లో ఆకాశం నీ హద్దురా సినిమా అవార్డులను కొల్లగొట్టేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన ఈ అవార్డులను తాజాగా కేంద్రం అందజేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విజేతలంతా కూడా అవార్డులను స్వీకరించారు. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు అందరూ హాజరయ్యారు. జంటగా సూర్య, జ్యోతిక అందరినీ కనువిందుచేశారు. ఉత్తమ నటుడిగా సూర్య, ఉత్తమ నిర్మాతగా జ్యోతిక అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
మన టాలీవుడ్ నుంచి కలర్ ఫోటో, నాట్యం వంటి సినిమాలకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పుడు మరోసారి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చర్చనీయాంశంగా మారింది. నేషనల్ లెవెల్లో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. సూర్య, సూరారా పొట్రూ హ్యాష్ ట్యాగ్లు మరోసారి జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. జూలైలో ఈ అవార్డులను ప్రకటించగా.. నేడు అందజేశారు. ఉత్తమ నటిగా అపర్ణా బాలమురళికి అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
సూరారైపొట్రూ సినిమాను హిందీలోనూ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని హిందీలోనూ సూర్య నిర్మిస్తున్నాడు. సుధా కొంగర మళ్లీ హిందీలోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్య పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తోన్న విషయం తెలిసిందే. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన ఈ మధ్యే జరిగింది. సూర్య 42వ సినిమాగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.
Also Read : దగ్గుబాటి అభిరామ్‌ను మళ్లీ గెలికిన శ్రీరెడ్డి..కొత్త సినిమాపై కౌంటర్లు దగ్గుబాటి అ
Also Read : పనిలో మునిగిన రేణూ దేశాయ్.. సెట్లోకి జూ. పవర్ స్టార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.