Bandla Ganesh Trivikram : ఎవరా డాలర్ శేషాద్రి?.. త్రివిక్రమేనా?.. బండ్ల గణేష్ ట్వీట్ అర్థం ఏంటి?
Bandla Ganesh Satire on Trivikram బండ్ల గణేష్ తాజాగా వేసిన ట్వీట్ అందరిలోనూ అనుమానాలు పుట్టించేస్తోంది. మరోసారి త్రివిక్రమ్ మీద కౌంటర్లు వేసినట్టుగా కనిపిస్తోంది. కానీ ఆ విషయాన్ని మాత్రం ప్రత్యక్షంగా చెప్పలేదు.
Bandla Ganesh Satire on Trivikram బండ్ల గణేష్ త్రివిక్రమ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ను దూరంగా ఉంచిన సంగతి తెలిసిందే. దానికి కారణం త్రివిక్రమ్ అని బండ్ల గణేష్ మాట్లాడిన ఆడియో లీక్ ఎంతటి సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. మొదట్లో ఆ వాయిస్ తనది కాదని బుకాయించాడు. ఆ తరువాత ఆ వాయిస్ తనదే అని, త్రివిక్రమ్ తిట్టింది తానే అని ఒప్పుకున్నాడు.
వకీల్ సాబ్ ఈవెంట్ దెబ్బకు బండ్ల గణేష్ స్పీచ్‌లకు ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. భీమ్లా నాయక్ ఈవెంట్లోనూ బండ్ల గణేష్ మాట్లాడితే.. ఇంకెవ్వరి స్పీచులు హైలెట్ కావనో మరేదైనా కారణమో గానీ ఆయన్ను దూరంగా పెట్టేశారు. అలా చివరకు బండ్ల గణేష్‌కు పవన్ కళ్యాణ్‌కు మధ్య గ్యాప్ ఏర్పడినట్టు కనిపిస్తోంది. ఆ గ్యాప్‌కు త్రివిక్రమ్ కారణమని బండ్ల గణేష్ ఇది వరకు పలు మార్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
బండ్ల గణేష్ మధ్యలో వేసిన ట్వీట్లు చూస్తే.. పవన్ కళ్యాణ్‌ను నమ్మి మోసపోయినట్టుగా అర్థమైంది. ఎవ్వరినీ నమ్మొద్దంటూ, జీవితంలో అవమానం, అనుమానాలు అంటూ ఇలా నానా రకాలుగా ట్వీట్లు వేశాడు. పవన్ కళ్యాణ్‌కు దూరంగా వచ్చినట్టుగా అర్థం వచ్చేలా ట్వీట్లు వేశాడు. అయితే తాను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తుడ్నే అని, ఆయన తన దైవం అని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు.
తాజాగా ఓ నెటిజన్ ఇలా అడిగేశాడు. అన్న పవన్ అన్నకీ నీ అపార్దాలతో దూరంగా వుండకు... ఒంటరిగా యుద్ధం చేస్తున్న వ్యక్తికి కొంచెం రిలీఫ్ నీలాంటి వాళ్ళు.. సమయం దొరికినప్పుడు కలువు.. ఆయన్నీ అర్థం చేసుకోలేక చాలా మంది సన్నిహితులు దూరం అయ్యారు..మీరు అలా కావద్దు అని వేడుకున్నాడు.
దీనికి బండ్ల గణేష్ ఇలా రిప్లై ఇచ్చాడు. మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ అని అన్నాడు. దీంతో ఆ డాలర్ శేషాద్రి మన త్రివిక్రమేనా?.. అంటూ బండ్ల గణేష్‌ను నెటిజన్లు అడుగుతున్నారు. దీంతో మరో కొత్త చర్చకు తెరదీసినట్టుగా కనిపిస్తోంది.
Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook