Nandamuri Vs Mega Fan War in Twitter: బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతున్న మెగా, నందమూరి అభిమానులు

Allu Arjun Tweet Cause Fan War Between NTR and Ram Charan Fans : ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ బన్నీ వేసిన ట్వీట్ ప్రభావం ఇంకా చూపిస్తోంది. తెలుగు ప్రైడ్ మా వాడంటే మా వాడంటూ మెగా నందమూరి అభిమాబనులు ట్విట్టర్‌లో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్ నేషనల్ లెవెల్‌కు చేరింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 19, 2023, 09:05 AM IST
  • నెట్టింట్లో తారాస్థాయికి ఫ్యాన్ వార్
  • ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ ట్రెండ్
  • నందమూరికి మెగా ఫ్యాన్స్ కౌంటర్లు..
Nandamuri Vs Mega Fan War in Twitter: బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతున్న మెగా, నందమూరి అభిమానులు

Nandamuri & Mega Fan War Due to Allu Arjun Tweet: సోషల్ మీడియాలో ఎప్పుడూ నందమూరి, మెగా అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక వార్ జరుగుతూనే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ విషయంలో మొదటి నుంచి కూడా ఈ వార్ జరుగుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వరకు పోయినా కూడా ఈ గొడవ మాత్రం తగ్గలేదు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సైతం ఈ వార్‌ను చూడలేకపోయింది. రామ్ చరణ్‌కి మాత్రమే కాదు.. ఎన్టీఆర్‌కి కూడా అవార్డ్ ఇచ్చామని, కానీ ఆయన రాలేదని, వచ్చాక ఇస్తామని వివరణ ఇచ్చుకునేలా ఫ్యాన్ వార్ ఒత్తిడి చెలరేగింది.

ఇక ఆస్కార్ గెలిచిన తరువాత బన్నీ లేటుగా రియాక్ట్ అయ్యాడు. బన్నీ లేటుగా ట్వీట్ వేశాడు. కానీ మంటపెట్టేశాడు. బన్నీ పెట్టిన మంటే తెలుగు ప్రైడ్. చరణ్ గురించి చెబుతూ లవ్లీ బ్రదర్ అన్నాడు. ఎన్టీఆర్ గురించి చెబుతూ తెలుగు ప్రైడ్ అన్నాడు. దీంతో మరో చర్చ మొదలైంది. అంటే రామ్ చరణ్‌ తెలుగు ప్రైడ్ కదా..? ఎన్టీఆర్ మాత్రమే తెలుగు ప్రైడా..? అని వార్ మొదలైంది.

ఇప్పుడు అదే తెలుగు ప్రైడ్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఆస్కార్ విన్ అయిన తరువాత ఎన్టీఆర్ విశ్వక్ సేన్‌ ధమ్కీ ఈవెంట్లో ఉన్నాడు. అదే రామ్ చరణ్‌ అయితే ప్రధాని, కేంద్రమంత్రులతో ఉన్నాడు. రేంజ్ మాటర్స్ అని, రామ్ చరణ్‌ తెలుగు ప్రైడ్ అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రైడ్ అనే ట్యాగ్‌ను మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్, తెలుగు ప్రైడ్ ఎట్ ధమ్కీ ఈవెంట్ అని నందమూరి ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. చూస్తుంటే ఈ వార్ ఇప్పట్లో ఆగేలా లేదనిపిస్తోంది.

ఇక రామ్ చరణ్‌, ఎన్టీఆర్ మధ్య కూడా గ్యాప్ వచ్చిందనే టాక్ ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. అందుకే ఆస్కార్ వేడుకల్లో ఇద్దరూ స్టెప్పులు వేయలేదని, దూరంగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. వేర్వేరుగా ఇండియాకు వచ్చారు.. లాస్ ఏంజిల్స్‌లోనూ వేర్వేరుగానే ఉన్నారు.

Also Read:  Kaala Bhairava Trolls : తారక్, చరణ్‌ పేర్లను మరిచిన సింగర్.. నెటిజన్ల ఆగ్రహం.. దెబ్బకు దిగొచ్చిన కాళ భైరవ

Also Read: Keerthy Suresh Pics : కీర్తి సురేష్‌ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News