Bandla Ganesh Says He loves Jr NTR So much: సెప్టెంబర్ రెండో తేదీన హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుమతి చివరి నిమిషంలో రద్దు చేసినప్పటి నుంచి కేసీఆర్ సర్కారు ఎన్టీఆర్ ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అదే సమయంలో బండ్ల గణేష్ ఎంట్రీ ఇచ్చి ఐ లవ్ యు కేసీఆర్ సార్ మీరు టైగర్ అనే విధంగా ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విధంగా తాము యంగ్ టైగర్ అని పిలిపించుకునే ఎన్టీఆర్ సభకు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేస్తే కేసీఆర్ కి ఐ లవ్ యు చెప్తారా? ఆయన టైగర్ అంటూ పొగుడుతారా అంటూ బండ్ల గణేష్ ను పెద్ద ఎత్తున టార్గెట్ చేసి ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా విమర్శిస్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని వారు పేర్కొంటున్నారు. అయితే అసలు బండ్ల గణేష్ ఎందుకు ఈ ట్వీట్ పెట్టారు అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు.




అయితే యంగ్ టైగర్ ను టార్గెట్ చేసినట్లు ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయం మీద జీ తెలుగు న్యూస్ లైవ్ డిబేట్ నిర్వహించింది. అదేవిధంగా వెబ్సైట్లో కూడా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ చేసింది. ఇక వెబ్సైట్ లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ కు బండ్ల గణేష్ స్పందించారు. తాను కేసీఆర్ను ప్రేమిస్తున్నానని ఆయన కంటే ఎక్కువగానే తన హీరో ఎన్టీఆర్ ని కూడా ప్రేమిస్తున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. జీ తెలుగు న్యూస్ ఆర్టికల్ ను షేర్ చేసిన బండ్ల గణేష్ ఈ మేరకు కామెంట్లు చేశారు. అయితే అసలు ఎందుకు ఈ విధంగా ఐలవ్యూ కేసీఆర్ అని చెప్పారు అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.


ఈ విషయం మీద స్వయంగా బండ్ల గణేష్ స్పందించి ఏదైనా క్లారిటీ ఇస్తే గాని అసలు ఎందుకు ట్విట్ చేశారనేది తెలియదు. అయితే ప్రస్తుతానికి ట్విట్టర్ లో వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. ఈ వన్ వర్డ్ ట్రెండ్ ప్రకారం ట్విట్టర్లో ట్విట్టర్ యూజర్లు తమకు నచ్చిన ఏదైనా ఒక పదాన్ని ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ సెలబ్రిటీలు సైతం ఈ వన్ వర్డ్ ట్రెండ్లో భాగమయ్యారు. బండ్ల గణేష్ కూడా అలా చేశారు అనుకోవడానికి కూడా ఆస్కారం కనిపించడం లేదు. ఎందుకంటే వన్ వర్డ్ అంటే కేసీఆర్ అని లేదా ఐ లవ్ యు అని చేయాలి కానీ ఐ లవ్ యు కేసీఆర్ మీరు టైగర్ అని అర్థం వచ్చేలా ఆయన లెంత్ ట్వీట్  చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 
 Also Read: Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?


Also Read: Bandla Ganesh Targets Jr NTR: కేసీఆర్ టైగర్ అంటూ బండ్ల కామెంట్స్.. ఆడుకుంటున్న ఎన్టీఆర్ ఫాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook