Bandla Ganesh - Sivaji Raja Donated Five Lakh Sixteen Thousand to a Poor Family: మన సినీ పరిశ్రమంలో నటీనటుల మధ్య స్నేహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారు ఎంతో స్నేహంగా మెలిగినా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే ఘటనలు ఎన్నో చూశాం. కానీ తాజాగా సినీ పరిశ్రమకు చెందిన ఒక ఎన్నికల విషయంలో మాత్రం బండ్ల గణేష్, శివాజీ రాజా చూపిన చొరవ ఇప్పుడు పలువురికి ఆదర్శనీయంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయం ఏమిటంటే ఫిలింనగర్ అనే ఒక కాలనీ ఏర్పాటు చేసిన తర్వాత సరదాగా సాయంకాలం గడిపేందుకుగాను ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ అనే ఒక క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రతి ఏడాది కమిటీలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్గా సినీ నటుడు శివాజీ రాజా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన ఈసారి ప్రెసిడెంట్ గా ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందని తెలియడంతో బండ్ల గణేష్ తాను వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.


ఈ మేరకు ట్విట్టర్ లో కూడా ప్రకటన ఇచ్చి తనను గెలిపించాల్సిందిగా కోరారు. అయితే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్ష బరిలో హనుమంతరావు అనే ఆయన కూడా దిగుతున్నారు. శివాజీ రాజాకు ఆయన బాగా కావాల్సిన వ్యక్తి కావడంతో తాను ఆయనకు పోటిగా దిగడం కరెక్ట్ కాదు అని భావించి మళ్లీ వైస్ ప్రెసిడెంట్ గా బరిలో దిగాలని భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ తమ 30 ఏళ్ల స్నేహం దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు పని చేశారు కాబట్టి ఈసారి పనిచేసే అవకాశం తనకు ఇవ్వమని అడిగారు.


ఒక పని చేద్దాం నాకు పోటీ చేయాలని ఉంది, నువ్వు తప్పుకుంటే నువ్వు చెప్పిన మంచి పని ఏదైనా నేను చేస్తాను, లేదా నన్ను తప్పుకోమంటే తప్పుకుంటాను కానీ నేను చెప్పిన ఒక మంచి పని చేయాలని సూచించారు. ఇదే విషయాన్ని పెద్దల మధ్యలో మాట ఇచ్చిన బండ్ల గణేష్ మీరేం చెప్పినా చేస్తానని మాట ఇచ్చారు.  అయితే శివాజీ రాజా సుమారు 20 ఏళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  తర్వాత చాలా ఇబ్బందులు పడి ఎలాగో కోలుకున్నారు. అయితే ఆ రోడ్డు ప్రమాదంలోనే నరేష్ అనే డ్రైవర్ కళ్ళు పోయాయి.


అప్పటి నుంచి శివాజీ రాజా నరేష్ కుటుంబానికి అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే తాజా అదే డ్రైవర్ కి ఇప్పుడు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. అలా ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉందనే విషయం తెలుసుకున్న శివాజీ రాజా ఆ కుటుంబానికి 5 లక్షల పదహారు వేల రూపాయలు ఇవ్వాలని బండ్ల గణేష్ కు సూచించారు. దానికి ఒప్పుకున్న బండ్ల గణేష్ తాజాగా ఆ 5 లక్షల పదహారు వేల రూపాయల చెక్కును సురేష్ కొండేటి, ఫిలింనగర్ కల్చరల్ సెంటర్కమిటీ మెంబర్లు శైలజా, సుష్మ, ఏడిద శ్రీరామ్ వంటి వారి సమక్షంలో ఆ కుటుంబానికి అందజేశారు.


సాధారణంగా ఎన్నికలంటే తిట్టిపోసుకుంటున్న సినీ నటులు ఈ ఎన్నికల కోసం మాత్రం ఇలా మంచి పని చేస్తూ పోటీ లేకుండా పక్కకు తప్పుకోవడం అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే విషయం మీద టాలీవుడ్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బండ్ల గణేష్, శివాజీ రాజా తీసుకున్న చొరవ మామూలుది కాదని ఈ ఇద్దరి స్నేహం ఒక కుటుంబానికి అండగా నిలబడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 


Also Read: 44 Years Of Undisputed Megastar:44 ఏళ్ల ప్రాణం ఖరీదు.. పాలేరు వేషంలో షూట్.. హీరోయిన్ ను అతుక్కుపోయిన చిరు.. మొదటి సినిమాకే బలుపంటూ కామెంట్స్!


Also Read: Aryan Rajesh as Villian: టాలీవుడ్ కి కొత్త విలన్.. రంగం సిద్దం చేసిన టాప్ డైరెక్టర్! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.