Youtuber Sarayu Case Update: సరయును విచారించిన బంజారాహిల్స్ పోలీసులు!
Sarayu Case Latest Update: 7 ఆర్ట్స్ యూట్యూట్ ఛానెల్‌తో పాప్‌లర్ అయిన సరయుపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. ఆమెను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు.
7 Arts YouTube Channel Sarayu Case Update: యూట్యూబర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయుపై ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. అయితే తాజాగా సరయును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సెవెన్ ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ (YouTube) ద్వారా ఫుల్ పాప్‌లర్ అయిన సరయు బోల్డ్‌గా మాట్లాడుతూ నెట్టింట్లో ఫుల్ రచ్చ చేస్తూ ఉంటుంది. బిగ్ బాస్‌తో (Bigg Boss) ఆమె మరింత పాప్‌లర్ అయింది. సరయు ఒక హోటల్ (Hotel) ప్రమోషన్ కోసం ఇటీవల ఒక సాంగ్‌లో నటించింది. అందులో అభ్యంతరకరమైన విజువల్స్ ఉన్నాయని సరయుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Banjara Hills Police Station) తాజాగా కేసు ఫైల్ అయింది.
సెవెన్ ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రమోట్ చేసేందుకు కొన్ని రోజుల క్రితం సరయు ఒక ప్రమోషనల్ సాంగ్‌లో యాక్ట్ చేసింది. అందులో సరయుతో పాటు టీమ్ అంతా కూడా తలకు గణపతి బొప్పా మోరియా అనే రిబ్బన్స్ ధరించి ఆల్కహాల్ తీసుకున్నట్లుగా యాక్ట్ చేశారు. ఈ వీడియోపై హిందు మత విశ్వాసాలను కించపరిచేలా ఉందంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు (Rajanna Sirisilla District) చెందిన విశ్వహిందూ పరిషత్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ అశోక్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే సరయును తాజాగా బంజారాహిల్స్ పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. సరయుపై ఇది వరకే ఫైల్ అయిన కేసులో భాగంగానే.. సోమవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. ఆమె వివరణ తీసుకుని పంపించారు. రేపు లాయర్‌తో కలిసి రావాలని పోలీసులు సరయుకు (Sarayu) సూచించారు.
Also Read: Inter Exams 2022: ఏప్రిల్ 20 నుంచి ఇంటర్ పరీక్షలు- పూర్తి షెడ్యూల్ ఇదే..
Also Read: Samantha Ruth Prabhu: ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న సమంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook