Case on Youtuber Sarayu: యూట్యూబర్ సరయూపై బంజారాహిల్స్ లో కేసు నమోదయ్యింది. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొన్న ఈమె.. తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఆ లఘు చిత్రంలో హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా సరయూ నటించిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు అందింది. సరయూతో పాటు ఆ షార్ట్ ఫిల్మ్ బృందంపై సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ సిరిసిల్లలో ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే?
బంజారాహిల్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పూసపాటి శివచంద్ర కథనం ప్రకారం.. సరయూ అనే మహిళ '7 ఆర్ట్స్' అనే యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తుంది. ఆ ఛానల్ రూపొందించిన అనేక షార్ట్ ఫిల్మ్స్ లో ఆమె కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో ఇటీవలే ఏర్పాటు చేసిన '7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్' కోసం లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియోను గతేడాది ఫిబ్రవరి 25న తమ '7 ఆర్ట్స్' యూట్యూబ్ ఛానల్ తో పాటు అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లోనూ విడుదల చేశారు.
ఆ లఘు చిత్రంలో సరయూతో పాటు ఆమె బృందమంతా.. గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు తలకు ధరించారు. దీంతో ఆ వీడియోలో హిందూ సమాజాన్ని.. ఆ సమాజానికి చెందిన మహిళలను కించపరిచే విధంగా ఉందని ఫిర్యాదు అందింది. దీంతో పాటు మద్యం తాగి హోటల్ కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చేపూరి అశోక్ అక్కడి ఠాణాలో పోలీసులను ఆశ్రయించారు.
కేసుపై విచారణ చేపట్టిన సిరిసిల్ల ఠాణా ఇన్‌స్పెక్టర్.. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్‌లో వీడియో చిత్రీకరించినట్లు ఆయన గుర్తించారు. దీంతో ఈ కేసును బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ బదిలీ చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో '7 ఆర్ట్స్' బృందంపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ALso Read: Lata Mangeshkar Telugu Songs: లతా మంగేష్కర్ పాడిన 2 తెలుగు పాటలూ సూపర్ హిట్టే
Also Read: Lata Mangeshkar: లతాకు పేరు తెచ్చిన పాట..చివరి పాట కూడా ఇండియన్ మిలట్రీపైనే..యాధృచ్ఛికమా కాదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook