Bigg Boss Telugu 7 Updates: బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. కిరణ్ రాథోడ్, షకీలా ఎలిమినేట్ కావడంతో.. ప్రస్తుతం హౌస్ లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. మూడో వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. వారే అమర్ దీప్, ప్రియాంక, శుభ శ్రీ, రతిక రోస్, దామిని, ప్రిన్స్ యావర్ మరియు గౌతమ్ కృష్ణ. పవర్ ఆస్త్రా ఉన్న కారణంగా సందీప్, శివాజీ సేఫ్ గా ఉన్నారు. అయితే ఈ వారం ప్రశాంత్, శోభా, టేస్టీ తేజా కూడా నామినేషన్స్ లో లేరు. అయితే మూడోవారం నామినేషన్స్ ప్రక్రియ చాలా సప్పగా సాగిందనే చెప్పాలి. ఈ వారం సిల్లీ రీజన్స్ కే నామినేట్ చేసుకున్నారు కంటెస్టెంట్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వారం నామినేషన్ లో ఉన్నవారికి ఓటింగ్ మెుదలైంది. ఇప్పటి వరకు అత్యధిక ఓట్లతో సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరికి తొలి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతడికి 19.82 శాతం ఓట్లు పడ్డాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ప్రిన్స్ యావర్ 18.99 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మిగతా స్థానాల్లో ప్రియాంక జైన్ 18.34 శాతం, రతిక రోజ్ 16.5 శాతం, గౌతమ్ కృష్ణ 13.81 శాతం, శుభ శ్రీ రాయగురు 7.11 శాతం  ఉన్నారు. అందరి కంటే చివరిలో  సింగర్ దామిని ఉంది. ఈమెకు కేవలం 5.43 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఈ వారం దామిని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభ శ్రీ కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. 


ఈసారి సీజన్ టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఉల్టా పుల్టా అంటూ ముందుగానే హింట్ ఇచ్చిన బిగ్ బాస్ ఎప్పటికప్పుడూ ట్రాకులు మార్చేస్తూ.. హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నారు. సీరియల్ బ్యాచ్ ఒకరినొకరు కొపరేట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. మరికొందరు మాత్రం కంటెంట్ కోసం పాకులాడుతున్నారు. నిజంగా హౌస్ లో గేమ్ ఎవరైనా బాగా ఆడుతున్నారంటే అది శివాజీ మాత్రమే. సందీప్ కూడా పర్వాలేదనే చెప్పాలి. 


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook