BB Telugu Grand Finale:  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫినాలే(BB Telugu Grand Finale latest promo)కు సంబంధించి లేటేస్ట్ ప్రోమో వచ్చేసింది. ఇందులో చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ లకు చెందిన సెలబ్రెటీలు సందడి చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి, రణబీర్ కపూర్, అలియా భట్, జగపతిబాబు, శ్రియ, సుకుమార్, దేవిశ్రీప్రసాద్, రష్మిక, నాని, సాయిపల్లవి, కృతిశెట్టిలు గెస్ట్ లుగా వచ్చినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. అంతేకాకుండా నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ లు నాటు నాటు సాంగ్ కు అదిరిపోయే డ్యాన్స్ చేసినట్లు చూపించారు. సింగర్ రాహుల్ సిప్లగంజ్ తన సింగింగ్ తో మరోసారి అదరగొట్టాడు. సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రోమోలో అలియా భట్ బాలయ్య డైలాగ్ చెప్పి అదరగొట్టింది. శ్యామ్ సింగరాయ్ మూవీ టీమ్ నాని, సాయిపల్లవి, కృతి శెట్టిలు హౌస్ లోకి వెళ్లి..కంటెస్టెంట్స్ తో డ్యాన్స్ చేశారు. హీరోయిన్ రష్మిక మందన్నా పుష్ప సినిమాలోని సాంగ్ కు స్టెప్పులతో ఇరగదీసింది. ఇంకా అదిరిపోయే సర్ ప్రైజ్ లు ఎన్నో ప్రోమోలో ఉన్నాయి. మీరు చూసేయండి.




Also Read: BB Telugu Grand Finale: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ప్రోమో వచ్చేసింది..ట్విస్ట్ ఏంటంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook