Bengali Actress Andrila Sharma Passed Away : సినీ పరిశ్రమ నుంచి వరుస విషాదాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మొన్న కృష్ణ, నిన్న డైరెక్టర్ మదన్ మరణించగా ఇప్పుడు మరో విషాదకర వార్త తెరమీదకు వచ్చింది. బంగ్లా నటి ఆండ్రిలా శర్మ అనారోగ్యంతో బాధ పేరుతో కన్నుమూశారు. ఆండ్రిలా శర్మవయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. ఈ వార్త తెరపైకి రావడంతో, ఆండ్రిలా శర్మ అభిమానులు అందరూ షాక్ అవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా నటి తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఆమెకు ఆపరేషన్ చేసినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆమె వెంటిలేటర్‌పై ఉంది. ఆండ్రిలా శర్మ బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా నవంబర్ 1వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చేరారు. ఒకరకంగా ఆమె 19 రోజుల పాటు జీవన్మరణ పోరాటం చేసింది. ఇక వైద్యులు చెబుతున్న సమాచారం ప్రకారం, నటి ఆండ్రిలా శనివారం సాయంత్రం అనేక సార్లు గుండెపోటుతో బాధపడ్డారు.


ఈ కారణంగా ఆమె పరిస్థితి క్షీణిస్తూనే ఉందని అలా క్షీణిస్తూ వచ్చిన ఆమె అనారోగ్యం విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచింది. కేవలం 24 ఏళ్ల వయసులో ఆండ్రిలా శర్మ ఈ విధంగా అందరినీ వదలి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆండ్రిలా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధిని ఓడించింది, కానీ నవంబర్ 1న ఆండ్రిలా శర్మ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా, ఆండ్రిల్లా ఎడమ ఫ్రంటోటెంపోరోపారిటల్ డి కంప్రెసెవి క్రానియోటమీ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది.


ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో, చాలా కాలంగా, మా బృందం ఆండ్రిలా పరిస్థితిని కోలుకోవడానికి పగలు మరియు రాత్రి శ్రమిస్తున్నామని, అయితే మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, మేము ఆమెను రక్షించలేకపోయామని పేర్కొంది. ఆదివారం మళ్లీ గుండెపోటు రావడంతో ఈరోజు మధ్యాహ్నం 12.59 గంటలకు కన్నుమూశారు. ఆండ్రిలా శర్మ బెంగాలీ సినిమాలలో మంచి ఫేమస్.


చిన్న వయసులోనే ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఆండ్రిలా ఝుమూర్ అనే టీవీ షోతో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఎన్నో షోలలో అద్భుతంగా నటించి అభిమానుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆండ్రిలా శర్మ ప్రియుడు సబ్యసాచి చౌదరి సోషల్ మీడియాలో గతంలో ఆమె త్వరలో కోలుకోవాలని కోరుకుంటూ భావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. 


Also Read: Lingusamy: నువ్ వారియర్ అనే సినిమా తీశావంతే.. వారియర్ కాదు లింగుస్వామీ!


Also Read: Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook