Lingusamy: నువ్ వారియర్ అనే సినిమా తీశావంతే.. వారియర్ కాదు లింగుస్వామీ!

Lingusamy Warns Telugu Producers: వారిసు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే సమయంలో ఇబ్బందులు సృష్టిస్తే ఊరుకునేది లేదంటూ లింగుస్వామి వర్కింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 20, 2022, 02:45 PM IST
 Lingusamy: నువ్ వారియర్ అనే సినిమా తీశావంతే.. వారియర్ కాదు లింగుస్వామీ!

Lingusamy Warns Telugu Producers over Varisu Release: తలపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. వాస్తవానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తారని ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణం కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. దానికి తోడు ప్రస్తుతం హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో ఒకరైన రష్మిక మందన్న ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో ఈ ప్రాజెక్టు మీద మరింత ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు దిల్ రాజు అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్నారు.

అదేమంటే ముందు ప్రకటించిన విధంగా కాకుండా ఈ సినిమా ఇప్పుడు ఒక తమిళ సినిమా అని దాన్ని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నామని దిల్ రాజు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత డైరెక్టర్ తెలుగు సినిమాలకే ఇవ్వాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది. దిల్ రాజు గతంలో చెప్పినట్లుగానే డబ్బింగ్ సినిమాలకు ద్వితీయ ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఒక లేఖ విడుదల చేసింది.

ఈ మేరకు ఎగ్జిబిటర్లను హెచ్చరించింది. ఈ విషయం మీద తాజాగా తమిళ్ దర్శకుల సంఘం మీటింగ్ జరగగా దానిమీద లింగస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లింగుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వారిసు అనేది తమిళం నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ అని ఆ సినిమాకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో థియేటర్స్ దొరకకపోతే తెలుగు సినిమా అనేక రకాలుగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే లింగు స్వామి వ్యాఖ్యల మీద తెలుగు వాళ్ళు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు తమిళ సినిమాల మార్కెట్లో 20 శాతం తెలుగు షేర్ ఉంటుందని అలాంటి తెలుగువాళ్లను బెదిరించే విధంగా మాట్లాడే స్థాయికి మీరు వెళ్లారా అని అంటున్నారు.

తమిళ దర్శకులను మనవాళ్లు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతున్న క్రమంలో తిరిగి తెలుగు వాళ్లకే వార్నింగ్ ఇచ్చే స్దితికి వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే తెలుగులో మీరు వారియర్ అనే సినిమా మాత్రమే చేశారు అంతేకానీ మీరేమీ వారియర్ కాదు ఇలాంటి డైలాగ్స్ కొట్టి అనవసరంగా తమిళ- తెలుగు ప్రేక్షకుల మధ్య విభేదాలు సృష్టించవద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి తమిళనాడులో ఇతర భాషల నుంచి డబ్బింగ్ చేసిన సినిమాలకు భారీ మొత్తాన్ని టాక్స్ గా కట్టాల్సి ఉంటుంది. అందుకే పెద్ద హీరోల సినిమాలు తప్ప చిన్న హీరోల సినిమాలను తమిళంలో విడుదల చేయరు.

ఇటీవల కార్తికేయ 2 విడుదల సమయంలో కూడా నిఖిల్  ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే విజయ్ కి తమిళ్ లో ఉన్న మార్కెట్ దృష్ట్యా తమిళంలో నేరుగా రిలీజ్ చేయాలని దిల్ రాజు నిర్ణయం తీసుకున్నారు. అలా చేస్తే టాక్స్ కూడా నార్మల్ తమిళ సినిమాకి పడినట్లే పడుతుందని భావించారు. దానికి తగ్గట్టుగా తెలుగు సినిమాలు షూటింగ్స్ ఆపేసిన సమయంలో కూడా దీనిని తమిళ సినిమా కోటాలో షూటింగ్ జరిపారు. దీంతో దిల్ రాజు అప్పటికప్పుడు సేఫ్ అయ్యాను అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఇక లింగుస్వామి చేసిన వ్యాఖ్యల మీద మాత్రం తెలుగు వారంతా ఫైర్ అవుతున్నారు దీనిపై మీ స్పందన ఏమిటో కామెంట్ చేయండి. 

Also Read: NTR fans : ఇంకా లేట్ అవనున్న కొరటాల సినిమా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీ!

Also Read: Naga Shaurya: అనూష శెట్టిని వివాహమాడిన నాగశౌర్య.. రాచరికపు స్టైల్ లో విందు భోజనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News