Bharatheeydu 2: కమల్ హాసన్ హీరోగా ఎపుడో 28 యేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమాలోని నటనకు కమల్ హాసన్ మూడోసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవడం విశేషం. దాదాపు భారతీయుడు విడుదలైన మూడు దశాబ్దాలకు కాస్త దగ్గర ‘భారతీయుడు 2‘ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ భారీ ఎత్తున ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, నెల్సన్, నిర్మాత ఏ.ఎం.రత్నం, ఏషియన్ సునీల్ నారంగ్ ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్, హీరోయిన్స్  మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు ప్రేక్షకులకు కనువిందు చేశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ ఈవెంట్‌లో..యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘28 ఏళ్ల క్రితం భారతీయుడు సినిమా సమయంలోనే నేను  శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఈ సినిమా కథతో వచ్చారు. రెండు కథలు కాస్త ఒకే రకంగా ఉన్నాయి. ఆ విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను.‘శంకర్ తోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాము ప్రొసీడ్ అన్నారు. పెద్దాయన అన్న ఒక్క మాటపై నమ్మకంతోనే శంకర్ తో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి అసలు  మాట్లాడుకోలేదు.


అప్పట్లో ఏ ఎం రత్నం ఈ  సినిమాను అత్యద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ తో ఈ మూవీ సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్  కథ రెడీగా లేదనన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు  మా కాంబినేషన్ లో  28 ఏళ్ల తరువాత భారతీయుడు 2 చేశాము. ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నోఒడిదుడుకులు ఎదురైనా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఆయన పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదన్నారు.
ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేము పూర్తి చేశాము. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి ఈ సందర్భంగా స్పెషల్ థాంక్స్ చెప్పారు. అంతేకాదు ఈ చిత్రంలో కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రల్లో ఒదిగిపోయారు. అనిరుధ్ సంగీతం బాగుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. రవి వర్మన్ నాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా ఉన్న టైం నుంచీ తెలుసు. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఎంతో ఆనందదాయకమైన విషయం అన్నారు. నాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ థాంక్స్’ అని అన్నారు.


Also read: AP Rains Alert: విస్తరిస్తున్న నైరుతి, ఏపీలో నాలుగు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook