Bharateeyudu2 - Kamal Haasan: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి చెప్పాలంటే 70వ దశకం చివర్లోనే తమిళం, తెలుగు, హిందీ సహా అన్ని భాషల్లో నటించిన ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇక స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి చెప్పాలంటే కమర్షియల్ చిత్రాలకు కొత్త ఒరవడి నేర్పాడు. ఆయన సినిమాల్లో సామాజిక అంశాలకు కమర్షియల్ అంశాలు జోడించి చెప్పడం ఆయన స్టైల్. తాజాగా ఆయన కమల్ హాసన్‌తో 'భారతీయుడు 2' సినిమా చేస్తున్నారు.  గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. చాలా యేళ్ల తర్వాత శంకర్, కమల్ హాసన్ కలయికలో వస్తోన్న 'భారతీయుడు 2' సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం చేసిన సేనాప‌తిగా ‘భార‌తీయుడు’ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భార‌తీయుడు 2’ రానుండ‌టంతో మూవీపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఈ సారి కథ, క‌థ‌నంలో మరింత బిగువుగా ఈ సినిమాను తెరకెక్కించారు శంకర్.  ఈ సినిమాలో కమల్ హాసన్‌ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీటైంది. ఒకటి రెండు ప్యాచ్ వర్క్స్ మినహా సినిమా మొత్తం పూర్తయింది.  ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడినికి వస్తున్నాడు.   


‘భార‌తీయుడు 2’ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.  దానికి అనుగుణంగానే ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో  సినిమాపై అంచ‌నాల‌ను పెంచుతూ వ‌స్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసిన శంక‌ర్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసే పనిలో పడ్డారు. మే నెలాఖ‌రున ప‌వ‌ర్‌ప్యాక్డ్ ట్రైల‌ర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జూన్‌లో  'భారతీయుడు 2' చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. డేట్ ఎపుడనేది త్వరలో అనౌన్స్ చేయనున్నారు. తెలుగులో భారతీయుడు 2 పేరుతో వస్తోన్న ఈ సినిమా తమిళంలో ఇండియన్ 2, హిందీలో హిందూస్థానీ 2 పేరుతో రాబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో ‘జీరో టాల‌రెన్స్‌’ లైన్ ఈ అంచ‌నాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. క‌మ‌ల్ హాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, ఎస్‌.జె.సూర్య‌, బాబీ సింహ త‌దిత‌రులు ముఖ్య  పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  అనిరుద్ ర‌విచంద్ర‌న్ మ్యూజిక్  అందిస్తున్నారు. ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేస్తున్నారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది.  ఈ క‌ల‌యిక ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంద‌న‌టంలో సందేహం లేదు.


లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్  క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది.
ఈ సినిమా నటీనటుల విషయానికొస్తే.. క‌మ‌ల్ హాస‌న్‌,కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు నటించారు.


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్కరన్


Also Read: Revanth Reddy Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్‌ సంచలనం.. రేవంత్‌ రెడ్డికి బీజేపీకిలోకి ఆహ్వానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter