Bharatheeyudu 2: కమల్ హాసన్ భారతీయుడు 2 ప్రమోషన్స్ షురూ.. జూలై 12న వరల్డ్ వైడ్‌గా విడుదల..
Bharatheeyudu 2: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన `భారతీయుడు` ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమాకు సీక్వెల్‌గా `భారతీయుడు 2` రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున స్టార్ట్ చేయబోతుంది.
Bharatheeyudu 2: లోక్ నాయకుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'భారతీయుడు' మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని తెలుగులో ‘భారతీయుడు’గా విడుదల చేసింది. హిందీలో హిందూస్థానీ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘భారతీయుడు 2’ తెరకెక్కించారు.
భారతీయుడు సీక్వెల్‌ను అందరి అంచనాలను మించేలా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2ను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి అద్భుత నటన కనబరచడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది. జూలై 12న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించారు. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో ఈవెంట్‌ను ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మన దేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోంది. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది.
కమల్ హాసన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించారు. ఎ.శ్రీకర ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా టి.ముత్తురాజ్ గా వర్క్ చేస్తున్నారు. బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణకుమార్‌లతో కలిసి డైరెక్టర్ శంకర్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ మూవీస్ ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీ జూన్ ఫస్ట్ వీక్ వరకు రెడీ చేసిన సెన్సార్ పంపించనున్నారు.
నటీనటులు:
కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, నెడుముడి వేణు, వివేక్, కాళిదాస్ జయరాం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, బాబీ సింహ, బ్రహ్మానందం, జాకీర్ హుస్సేన్, పియుష్ మిశ్రా, గురు సోమసుందరం, డిల్లీ గణేష్, జయప్రకాష్, మనోబాల, అశ్వినీ తంగరాజ్ తదితరులు నటించారు.
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: ఎస్.శంకర్, స్క్రీన్ ప్లే: ఎస్.శంకర్, బి.జయమోహన్, కబిలన్ వైరముత్తు, లక్ష్మీ శరవణ కుమార్, కొరియోగ్రఫీ: బాస్కో సీజర్, బాబా భాస్కర్, పాటలు: శ్రీమణి, సౌండ్ డిజైనర్: కునాల్ రాజన్, మేకప్ : లెగసీ ఎఫెక్ట్-వాన్స్ హర్ట్‌వెల్- పట్టణం రషీద్, కాస్టూమ్ డిజైన్: రాకీ-గవిన్ మ్యూగైల్- అమృతా రామ్-ఎస్‌బి సతీషన్-పల్లవి సింగ్-వి.సాయి, పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య ,పి.ఆర్.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుందర్ రాజ్, హెడ్ ఆఫ్ లైకా ప్రొడక్షన్స్: జి.కె.ఎం.తమిళ్ కుమరన్, రెడ్ జైంట్ మూవీస్: సెన్‌బగ మూర్తి, నిర్మాత: సుభాస్కరన్ మ్యూజిక్ : అనిరుద్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: రవివర్మన్, ఆర్ట్: ముత్తురాజ్, స్టంట్స్: అనల్ అరసు, అన్బరివు, రంజాన్ బులట్, పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, డైలాగ్ రైటర్: హనుమాన్ చౌదరి, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ వైజర్: వి.శ్రీనివాస్ మోహన్,
Also read: Iran Helicopter Crash: హెలీకాప్టర్ ఎక్కడ కూలింది, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలతో ఉన్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి