Bheemla Nayak Hindi: పవన్ కల్యాణ్​, రానాలు ప్రధాన పాత్రలో నటించిన మూవీ భీమ్లా నాయక్​. గత నెల 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్​ బస్టర్​ హిట్​గా నిలిచింది. సినిమా విడుదల రోజు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చూస్తే ఈ మూవీ ఎంతలా ఎంటర్​టైన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని హిందీ ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది భీమ్లానాయక్ మూవీ. తాజాగా హీందీ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​.
తెలుగులో మాదిరిగానే హిందీలోనూ పవర్​ ఫుల్​ డైలాగ్స్​ ఉండటం విశేషం. ఇటీవలి కాలంలో తెలుగు యాక్షన్ సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో.. దాదాపు పెద్ద సినిమాలన్నీ హిందీలో డబ్బ్ అవుతున్నాయి. ఇటీవల హిందీలో ఏకకాలంలో విడుదలైన పుష్ప మూవీ అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.


ఇక ఇప్పుడు భీమ్లా నాయక్​ తెలుగులో సృష్టించినట్లుగానే.. రికార్డులు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఈ మూవీ హిందీలో ఎప్పుడు విడుదల అవుతుంది? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.


హిందీ చిత్రాన్ని బి4యూ మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్​ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.



ఇక ఈ సినిమాలో నిత్యామీనన్​, సంయుక్తా మీనన్​లు హీరోయిన్లుగా నటించారు. సాగర్​ కే చెంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్​ శ్రీనివాస్​ మాటలు అందించారు. తమన్​ మ్యూజిక్ ఇచ్చారు. సితారా ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై.. నాగ వంశీ ఈ మూవీకి ప్రొడ్యూసర్​గా వ్యవహరించారు.


Also read: Bigg Boss Telugu OTT: బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ఎలిమినేట్ అయ్యేది మళ్లీ సరయూనేనా


Also read: Kareena and Kajol: సుదీర్ఘ కాలం తరువాత కలుసుకున్న కరీనా, కాజోల్, కౌగిలించుకుని, ముద్దులు కూడా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook