Bheemla Nayak Trailer Postponed : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. ఫిబ్రవరి 25న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచేసిన చిత్రబృందం.. నేడు (సోమవారం) హైదరాబాద్ లో చిత్ర ప్రీ - రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుంది. యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు హాజరు కానున్నారు. మరో స్పెషల్ గెస్ట్స్ గా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రైలర్ ముహూర్తం


సోమవారం జరగనున్న 'భీమ్లా నాయక్' మూవీ ప్రీ - రిలీజ్ ఈవెంట్ లో చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 21న రాత్రి 8.10 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు సితార ఎంటర్ టైన్మెంట్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకోగా.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 



 


మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.  


Also Read: Samantha Best Friend: నువ్వు లేని ఈ జీవితంను అస్సలు ఊహించలేను.. ఫోటో షేర్ చేసిన సమంత!!


Also Read: Allu Arjun Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook