Allu Arjun Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక..

Allu Arjun Pushpa: 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం లభించింది. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2022, 10:00 PM IST
Allu Arjun Pushpa: అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపిక..

Allu Arjun Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Alllu Arjun) 'పుష్ప' సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దాదాసాహెబ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్​ 2022 అవార్డుకు (Dadasaheb Phalke International Film Festival Awards 2022) 'పుష్ప' ఎంపికైంది. ఈ విషయాన్ని ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొంది. 

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప' (Pushpa Movie). సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 

ఈ చిత్రంలో డైలాగ్స్, సాంగ్స్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. యూట్యూబ్ లో రికార్డ్సు సృష్టించాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా అందరూ ఈ సినిమాలోని డైలాగ్స్ ను, సాంగ్స్ ను రిక్రియేట్ చేశారు. 'పుష్ప' రెండో భాగం షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ ఏడాది డిసెంబరులో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు మేకర్స్. 

Also Read: Samantha Yashoda: సమంత కోసం కళ్లు చెదిరే సెట్... ఈ సెట్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News