Bhumika in Anasuya`s place: యాంకర్ అనసూయ స్థానంలో భూమిక
Bhumika in Anchor Anasuya`s place: యాంకర్ అనసూయ స్థానంలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా చేయబోతోంది. యాంకర్ అనసూయ స్థానంలో అనగానే అదేదో టీవీ షాలో యాంకరింగో లేక హోస్టింగో అనుకోకండి. ఎందుకంటే భూమిక సైన్ చేసింది సినిమాకు కనుక. అవును.. అనసూయ ఒక సినిమాలో చేయాల్సి ఉన్న ఓ పాత్ర నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో భూమిక చావ్లాను ( Actress Bhumika Chawla ) తీసుకున్నారు.
Bhumika in Anchor Anasuya's place: యాంకర్ అనసూయ స్థానంలో సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా చేయబోతోంది. యాంకర్ అనసూయ ( Anchor Anasuya Bharadwaj ) స్థానంలో అనగానే అదేదో టీవీ షాలో యాంకరింగో లేక హోస్టింగో అనుకోకండి. ఎందుకంటే భూమిక సైన్ చేసింది సినిమాకు కనుక. అవును.. అనసూయ ఒక సినిమాలో చేయాల్సి ఉన్న ఓ పాత్ర నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో భూమిక చావ్లాను ( Actress Bhumika Chawla ) తీసుకున్నారు. Also read : Kajal Aggarwal ties knot: గౌతం కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్
ఎంసీఏ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భూమిక చావ్లా ఆ తర్వాత యు-టర్న్, సవ్యసాచి వంటి సినిమాలు చేసినప్పటికీ.. ఆమెను పూర్తిస్థాయిలో బిజీ చేసే పాత్రలు ఇంకా దక్కలేదు. రూలర్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటించిన భూమిక ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమాలోనూ ( Seetimaarr ) ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇదిలావుండగా తాజాగా సుమంత్ అశ్విన్, తాన్య హోప్, అనసూయ, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మరో సినిమాకు భూమిక సైన్ చేసింది. యాంకర్ అనసూయ ( Anchor Anasuya ) ఈ సినిమా నుంచి తప్పుకోవడం వల్లే ఆమె స్థానంలో భూమికా చావ్లా ఎంటరైనట్టు తెలుస్తోంది. ఐతే అనసూయ నిష్క్రమణకు గల కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. గురు పవన్ డైరెక్ట్ ( Director Guru Pawan ) చేస్తోన్న ఈ సినిమాను జి మహేష్ నిర్మిస్తున్నాడు. లాక్డౌన్ కంటే ముందుగానే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. Also read : Punarnavi Bhupalam: పునర్నవి భూపాలం ఎంగేజ్మెంట్ కాలేదు.. మరి రఘునందన్ ఎవరు ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe