Bhupinder Singh`s death: ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన లెజెండరీ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు
Bhupinder Singh`s death News: ప్రముఖ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం ముంబైలో కన్నుమూశారు. భూపిందర్ సింగ్ భార్య, సింగర్ మిథాలి సింగ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
Bhupinder Singh's death News: ప్రముఖ సింగర్ భూపిందర్ సింగ్ ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. మూత్ర సంబంధిత వ్యాధులతో పాటు పలు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూపిందర్ సింగ్ ఆ సమస్యలతోనే మృతి చెందినట్టు ఆయన భార్య మిథాలి సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏళ్లు. బాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలకు పాటలు పాడిన లెజెండరీ సింగర్‌గా భూపిందర్ సింగ్‌కి మంచి గుర్తింపు ఉంది. కిషోర్ కుమార్, రఫీ వంటి లెజెండరీ సింగర్స్‌తోనూ భూపిందర్ కలిసి పాటలు పాడారు.
మౌసం, ఆహిస్తా ఆహిస్తా, దూరియా, హఖీఖత్ వంటి చిత్రాల్లో భూపిందర్ సింగ్ పాడిన పాటలు ఆయన గాత్ర ప్రతిభకు కొన్ని మచ్చుతునకలుగా బాలీవుడ్ ఆడియెన్స్ చెబుతుంటారు. భూపిందర్ సింగ్ భార్య మిథాలి సింగ్ కూడా నేపథ్య గాయకురాలే.
Also Read : Nayanthara Remuneration: వివాహానంతరం భారీగా పెంచేసిన నయనతార.. ఏకంగా డబుల్ చేసిందిగా!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook