Vijay Antoni New Movie: డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య' తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా.. హీరోయిన్‌గా రితికా సింగ్.. సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీదొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా.. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.


ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కథానాయకుడు రంగంలోకి దిగినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తుంది. పోస్టర్‌లో మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ లాంటి పాత్రలను రివీల్ చేశారు. వీళ్లను అనుమానితులుగా హీరో భావిస్తున్నట్లు ఉంది. హ్యాట్ , కోటుతో డిటెక్టివ్ లుక్‌లో సహజంగా కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని అనుకోవచ్చు. '1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య'  సినిమా సాగనుంది.


ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి 'విజయ్ రాఘవన' అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో 'హత్య' సినిమానిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.


Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!


Also Read: AP Cabinet: ఇవాళ అంతా రాజీనామా.ఎవరు ఇన్..ఎవరు అవుట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook