Prabhas: గాయాల పాలైన ప్రభాస్.. ఆందోళనలో ఫ్యాన్స్..!
Prabhas: ప్రస్తుతం తెలుగులోనే కాదు.. అన్ని భాషలలోనూ సూపర్ స్టార్ గా ఎదిగారు.. రెబల్ స్టార్ ప్రభాస్. కాగా ప్రస్తుతం ఈ హీరో పలు పాన్ ఇండియా చిత్రాలతో తెగ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఒక సినిమా షూటింగ్ ఈయన గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్త విని ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. పూర్తి వివరాలులోకి వెళ్ళితే..
Prabhas accident: పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. రెబల్ స్టార్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకోవడం జరిగింది. బాహుబలి తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ ఇటీవల కల్కి 2898AD సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈయన గాయాల పాలైనట్లు సమాచారం. ప్రభాస్ ఒక సినిమా షూటింగ్లో గాయపడ్డారు. జపాన్లో వచ్చే నెల మూడవ తేదీన రిలీజ్ అయ్యే కల్కి ప్రమోషన్లకు తాను హాజరు కావట్లేదని వెల్లడించారు.
ఒక సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని ఆయన ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్ లో పాల్గొంటుందని కూడా ప్రభాస్ తెలిపారు. ఇక దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నారు ప్రభాస్. అంతేకాదు మరొకవైపు సీతారామం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు.. ఈ సినిమాకి ఫౌజీ అనే టైటిల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలతో పాటు కల్కి 2, స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలను లైన్లో పెట్టారు ప్రభాస్. ఈ సినిమాలన్నీ గనుక విజయం సాధించాయంటే ఇండియన్ బాక్సాఫీస్ ఈయనను ఢీ కొట్టే వారు మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా ప్రభాస్ వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రభాస్ విషయానికి వస్తే రాఘవేంద్ర ,ఈశ్వర్ సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, ఆ తర్వాత ఎన్నో చిత్రాలు చేశారు. కానీ ఏ సినిమా కూడా భారీ విజయాన్ని అందించలేదు. కానీ ఒక్క బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయ్యారు. ఇక ఇప్పుడు వరుస పాన్ ఇండియా చిత్రాలు ప్రకటిస్తూ మరింత బిజీగా మారిపోయారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.