Jayaprada Supreme Court Case: ప్రముఖ నటి జయప్రదకు కొద్దిరోజులుగా తన పైన నడుస్తున్న కేసులో సుప్రీంకోర్టు దగ్గరనుండి ఊరట దక్కింది. అసలు విషయానికి వస్తే చెన్నైలోని జయప్రద సినిమా థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో కింద స్థాయి కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా ఆ కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్షపై సుప్రీం కోర్ట్ న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమె ఉపశమనం లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు ఈ నటి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జయప్రద పిటిషన్‌పై హైకోర్టులో విచారణ పూర్తిగా ముగిసే వరకు ఆమె జైలు శిక్ష పై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


ముందుగా ఆమె తేకరికి సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో చెన్నై ట్రయల్ కోర్టు ఆమెకు 6 నెలల జైలుశిక్ష విధించింది. కాగా ఈ తీర్పును ఆమె హైకోర్టులో సవాలు చేసింది. కానీ హైకోర్టు వారు కూడా ట్రయల్ కోర్టును సమర్ధించి‌ స్టే విధించడానికి నిరాకరించడంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టులో జయప్రద సవాలు చేశారు. సుప్రీం కోర్టు మాత్రం ఇప్పుడు ఈ కేసు పై స్టే విధించింది.


కాగా రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి జయప్రద చెన్నైలో ఓ థియేటర్ నిర్వహించారు. ఈ థియేటర్ నిర్మాణాలలో  ఈఎస్ఐ చెల్లింపుల్లో వీరు ముగ్గురు అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం జయప్రదతో సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది. ఈ కేసు పైనే ప్రస్తుతం జయప్రద చిక్కుల్లో చిక్కుకుంది. కానీ సుప్రీం కోర్టు నుంచి వచ్చిన తీర్పు మాత్రం ఆమెకు ఉపశమనం కలిగించింది.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి