Mohan Babu: మోహన్‌బాబుకు మరో బిగ్ షాక్.. హత్యాయత్నం కేసు నమోదు..! లీగల్ ఒపీనియన్‌తో మార్పు..
Attempt Murder Case On Mohan Babu: మోహన్ బాబుకు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఆయనపై కేసు నమోదు చేసి మరో బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. రిపోర్టర్‌పై దాడి నేపథ్యంలో ఆయనపై ఇప్పటికే BNS 118 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్‌తో దాన్ని మార్చారు.
Attempt Murder Case On Mohan Babu: మంచు వివాదంలో మరో బిగ్ షాక్ తగిలింది మోహన్ బాబుకు ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మొన్న రాత్రి మంచు మనోజ్, మౌనిక శంషాబాద్‌లోని జల్‌పల్లి ఫామ్ హౌజ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కవరేజీ కోసం మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లారు కానీ, లోపలికి రాకుండా మనోజ్‌ను గేటు మూసివేశారు. ఆయన బలవంతంగా గేట్లు తోసుకుని మరీ లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మీడియావారు కూడా లోపలికి వెళ్లారు. అక్కడ కాస్త వాగ్వాదం జరగడంతో మనోజ్ చొక్క కూడా చినిగిపోయింది. ఆ సమయంలోనే కోపోద్రిక్తుడై, విచక్షణ కోల్పోయి నటుడు మోహన్ బాబా టీవీ9 రిపోర్టర్‌పై దాడి చేశాడు. ఆయన అయ్యప్ప దీక్షలో కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర గాయాలు అతని దవడ, ఇతర ప్రాంతాల్లో అయ్యాయి.
ఆ తర్వాత మోహన్ బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కంటినెంటల్ ఆసుపత్రి వారు ఇంటర్నల్‌గా ఏవో గాయాలు అయ్యాయి అని మోహన్‌బాబుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ విడుదల చేశారు. మీడియా ప్రతినిధికి కూడా ఆసుపత్రిలో చేరారు. చికిత్స అందించారు. రిపోర్టర్‌పై మోహనబాబు దాడి చేయడంతో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు మండిపడ్డారు. ఇదిలా ఉండగా మరుసటి రోజు మోహన్‌బాబుపై BNS 118 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ, లీగల్ ఒపీనియన్ తర్వాత నేడు మోహన్ బాబుపై కేసును BNS 109 సెక్షన్ అంటే అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు పహడీ షరిఫ్ పోలీసులు రెండు రాష్ట్రాల జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టడంతో పోలీసులు దిగివచ్చారు.
ఇదీ చదవండి: మంచు లక్ష్మి సంచలన పోస్ట్.. భూమా మౌనిక ఏం చేసిందో తెలుసా?
నిన్న అంతా జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలాంటి అహంకారం కలిగిన వ్యక్తులు సొసైటీలో ఉండటం సరికాదని చాలామంది అంటున్నారు. సినీ నటుడు కవరేజీకి వెళ్లిన రిపోర్టర్ చేతిలో నుంచి మైక్ లాక్కొని అతనిపై దాడి చేశాడు. ఆ వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అయింది.
దాడి నేపథ్యంలో నిన్న ఫిల్మ్ ఛాంబర్ వద్ద జర్నలిస్టు సంఘాలు సైతం ఆందోళన చేపట్టారు. మరోవైపు నిన్న మంచు మనోజ్ ఉదయం మీడియాతో మాట్లాడారు. నాకోసం వచ్చిన మీకు ఇలా జరగడం క్షమించండి. మా నాన్న తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా అన్నారు. అయితే, నిన్న సాయంత్రం ప్రెస్ మీట్‌లో అన్ని విషయాలు చెబుతా.. ఇక ఊరుకునేది లేదు అన్న మంచు మనోజ్ సడెన్‌గా నిన్న ప్రెస్ మీట్ కేన్సల్ చేసుకున్నారు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. ఇదిలా ఉండగా నిన్న సీపీ మంచు విష్ణుతో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అంతకు మందే వీరి వద్ద ఉన్న గన్‌లను కూడా పోలీసులు సరెండర్ చేసుకున్నారు. బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశించారు..
ఇదీ చదవండి: మోహన్ బాబు ఫ్యామిలీ మొత్తాన్ని కాంప్రమైజ్ చేసే దమ్ము ఆ ఒక్కడికే ఉందట.. ఆయన ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.