Jani Master: జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. బెయిల్ రద్దు..?
Jani Master: జానీ మాస్టర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రీసెంట్ గా జాతీయ అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సిన నేపథ్యంలో కోర్టు జానీ మాస్టర్ కు నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్రం ఈయనకు వచ్చిన నేషనల్ అవార్డును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దీంతో జానీ మాస్టర్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నాయి.
Jani Master: ప్రతి నటుడు లేదా కళాకారుడికి జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతులు మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం ఓ కల. అలాంటి అవకాశాన్ని జానీ మాస్టర్ చే జేతుల జార విడుచుకున్నాడనే చెప్పాలి. చేతికి వచ్చింది నోటికి అందక పోవడం అంటే ఇదేనేమో. ఎపుడో కానీ లైఫ్ లో ఇలాంటి అవకాశం రాదు. అలాంటి అరుదైన ఛాన్స్ ను జానీ మాస్టర్ కు మిస్ అయిందనే చెప్పాలి. జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోన్న ఆమెకు అవకాశాల ఎర చూపి ఆమె పై పలమార్లు అత్యాచారం చేసాడు. దీంతో పోలీసులు అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసారు.
జానీ మాస్టర్ పై ఎంతో తీవ్రతతో కూడిన పోక్సో కేసు నమోదు కావడంతో జాతీయ అవార్డుల కమిటీ ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును కేంద్రం రద్దు చేస్తున్నట్టు కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో అరెస్టయిన జానీ మాస్టర్‌కు ఇటీవలే మధ్యంతర బెయిల్ రంగారెడ్డి జిల్లా కోర్టు మంజూరు అయింది. జాతీయ అవార్డుల కార్యక్రమానికి హాజరవ్వాలని అందుకుగాను బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా.. పరిశీలించిన రంగారెడ్డి న్యాయస్థానం ఈనెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేసింది.
జానీ మాస్టర్ .. సదరు లేడీ కొరియోగ్రాఫర్ నన్నేం చేస్తుందలే.. ఇండస్ట్రీలో అందరినీ నేను కావాలనే అహంకారంతో పాటు... ఆమెకు అవకాశాలు లేకుండా చేయడం కూడా జానీ మాస్టర్ చేసిన పెద్ద తప్పు. అంతేకాదు ఆ అమ్మాయి అవకాశాలను అడ్డుకోకుండా ఉండాల్సిందనే మాట వినబడుతుంది. మొత్తంగా జానీ మాస్టర్ అహంకార పూరితంగా చేసిన పనుల కారణంగా తాను తీసిన గోతిలో తాను పడ్డాడనే చెప్పాలి.
అనంతరం అక్టోబరు 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టు ఎదుట హజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది. రెండు లక్షల చొప్పున రెండు పూచికత్తులు సమర్పించాలని పేర్కొంది. ఈ సమయంలో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని కోర్టు తెలిపింది. అలాగే మరో మారు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. అయితే, అనూహ్యంగా ఆయనకు నేషనల్ అవార్డు రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ తమిళ నటుడు ధనుష్ నటించిన తిరుచిట్రంబలం సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కు ఇటీవల నేషనల్ అవార్డు ప్రకటించారు. తాజాగా దేనికోసమైతే.. జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేసిందో.. అది క్యాన్సిల్ కావడంతో ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter