Jani Master Case: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ ఆరోపణలు వాస్తవమయ్యాయి. జానీ మాస్టర్‌పై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో పలు కీలక అంశాలను పోలీసులు ప్రస్తావించారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు  తీసుకువెళ్లి.. లైంగిక దాడులకు పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్‌షీట్‌లో వెల్లడించారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: MAA Statement: హీరో అల్లు అర్జున్ వివాదంపై మంచు విష్ణు సంచలన ప్రకటన


కొంతకాలంగా  తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా అస్టిస్టెంట్‌ డ్యాన్స్ మాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. జానీ మాస్టర్‌ కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణ చేశారు.  లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు తేల్చేశారు. ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి జానీ మాస్టర్ లైంగిక దాడి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.

Also Read: Jr NTR Fan: జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలపై యూటర్న్‌.. కౌశిక్‌ తల్లి వివరణ ఇదే!


జరిగింది ఇదే..
అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఎఫ్ఐఆర్లో చెప్పిన వివరాల ప్రకారం... 2017లో ‘ఢీ’ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ బృందం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో 2019లో జానీ మాస్టర్ బృందంలో చేరినట్లు బాధిత యువతి పేర్కొంది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఔట్ డోర్ షూటింగ్స్ చేస్తున్నప్పుడు తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం కూడా చేశాడని.. గాయపరిచాడని ఫిర్యాదులో వాపోయింది. నార్సింగిలోని తన ఇంటికి కూడా వచ్చి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలిపింది.


జానీ మాస్టర్‌  దగ్గర జాయిన్ మొదటి రోజు నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని ఆ యువతి తెలిపింది. ప్రతీసారి తన కోరిక తీర్చమని వేధించేవాడని బాధితురాలు వాపోయిన విషయం తెలిసిందే. కోరిక తీర్చకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బెదిరించాడని.. షూటింగ్‌ జరుగుతున్న టైమ్‌లో తన వ్యాన్‌లోకి వచ్చి తన ప్యాంట్ జిప్‌ తీసి బలవంతం చేశాడని బాధితురాలు పూసగుచ్చినట్లు వివరించింది. నిరాకరించేసరికి తన తలను అద్దంకేసి కొట్టాడని వాపోయిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి అరెస్ట్ చేశారు. కొన్నాళ్లు జైలులో ఉన్న అనంతరం జానీ మాస్టర్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇప్పుడు వేధింపులు నిర్ధారణ కావడంతో త్వరలోనే మళ్లీ అతడు అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.