Train Tickets Subsidy in Telugu: మరి కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్దిక బడ్జెట్‌పై ప్రతి ఒక్కరికీ చాలా అంచనాలున్నాయి. 2025 ఫిబ్రవరిలో రానున్న బడ్జెట్‌లో కీలకమైన ప్రకటనలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు చాలా ఆశలున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులయితే కొత్త వేతన సంఘం ప్రకటన కోసం చూస్తున్నారు.
ఈసారి రానున్న బడ్జెట్‌పై అందరికీ అన్ని అశలూ ఉన్నట్టే సీనియర్ సిటిజన్లకు ఎక్కువ అంచనాలున్నాయి. ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఇచ్చే 40-50 శాతం సబ్సిడీ గురించి చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రైల్వే ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు అందించిన 40-50 శాతం సబ్సిడీ తొలగించారు. దీని ప్రకారం పురుషులు 60 ఏళ్లు దాటితే 40 శాతం సబ్సిడీ ఉండేది అదే మహిళలయితే 58 ఏళ్లు దాటితే 50 శాతం డిస్కౌంట్ లభించేది. మెయిల్ , ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లకు ఈ వెసులుబాటు వర్తించేది. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ఆర్ధిక పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ తొలగించింది. అప్పట్నించి తిరిగి పునరుద్ధరించలేదు. ప్రతి బడ్జెట్ సమయంలో సబ్సిడీ ప్రకటన ఉంటుందని సీనియర్ సిటిజన్లు ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రభావం లేకపోయినా ప్రభుత్వం రైల్వే టికెట్లపై సబ్సిడీని తిరిగి ప్రారంభించలేదు. సబ్సిడీ తిరిగి ప్రారంభించాలని సీనియర్ సిటిజన్లు చాలా ఆశలు పెట్టుకుంటూ వస్తున్నారు. 40-50 శాతం సబ్సిడీ తిరిగి కొనసాగించాలంటూ సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈసారి అంటే 2025 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో రైల్వే టికెట్ల సబ్సిడీ ప్రకటన ఉండవచ్చని భావిస్తున్నారు. మూడోసారి అధికారంలో వచ్చిన నరేంద్ర మోదీకు ఇది తొలి బడ్జెట్. సబ్సిడీ తిరిగి కొనసాగిస్తే లక్షలాదిమంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలగనుంది.
Also read: School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.