Prabhas Spirit Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యనే వరుసగా సలార్, కల్కి సినిమాలతో భారీ హిట్లు అందుకున్నారు. ఇక ప్రభాస్ తదుపరి సినిమాల మీద కూడా అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అతి త్వరలో ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో.. ఒక సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు. సినిమా షూటింగ్ త్వరలో మొదలవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ప్రభాస్.. మారుతీ.. దర్శకత్వంలో చేస్తున్న రాజా సాబ్ సినిమా గ్లింప్స్.. నిన్న విడుదలై.. ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకట్టుకుంది. కల్కి, సలార్ సినిమాల రెండవ పార్ట్ సినిమాలు కూడా ఇంకా మొదలు కావాలి. మరోవైపు ప్రభాస్ చేతిలో ఉన్న మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టు స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం.. వహిస్తున్న ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినిమాపై మరింత క్రేజ్ ను పెంచింది. 


తాజా సమాచారం ప్రకారం..ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చాలా కాలం క్రితం బిల్లా సినిమాలో డ్యూయల్ రోల్ లో.. నటించిన ప్రభాస్ మళ్ళీ అలా కనిపించలేదు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా మాత్రమే కాక.. విలన్ గా కూడా కనిపించనున్నారట. ప్రభాస్ ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు విలన్ కూడా అని సమాచారం. 


ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ అంటే ఈ సినిమాలో.. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూడడానికి ఫాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.


అర్జున్ రెడ్డి, యానిమల్ ఇలా సందీప్ సినిమాలలో హీరో పాత్రలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉంటుందని చెప్పుకోవచ్చు. పైగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ సందీప్ వంగా.. ఈ సినిమాలో ప్రభాస్ ని ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి.. పాత్రలో చూపిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.


Also Read: Revanth vs Tollywood: నా మాటలకే స్పందన ఇవ్వరా? సినీ పరిశ్రమపై మళ్లీ రేవంత్‌ రెడ్డి అసంతృప్తి


Also Read: Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర చర్చ.. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిన కోమటిరెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter