ఎప్పుడైతే బాహుబలి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిపోయిందో.. అప్పుడే మన డార్లింగ్ ప్రభాస్ బాలీవుడ్ స్థాయిలో స్టార్ హీరో అయిపోయాడు. బాలీవుడ్‌లో కొన్నేళ్ల నుంచి సినిమాలు చేస్తున్న వారికి కూడా రానంత స్టార్‌డమ్ కేవలం మొదటి సినిమాతోనే సొంతం చేసుకున్నాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే బాగుండు అని ఉవ్విళ్లూరుతున్న బాలీవుడ్, హిందీ బుల్లితెర సెలబ్రిటీల సంఖ్య కూడా అంతే భారీగా వుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూరే అంటే అక్కడ డార్లింగ్‌కి వున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బాహుబలి ప్రభాస్ సినిమాలో తనకు ఓ అవకాశం వచ్చిందని ప్రకటించుకుంది ఓ హిందీ టీవీ సెలబ్రిటీ. సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ 11 సీజన్‌లో పాల్గొని, షోలో వున్నంత కాలం తన ఉనికిని చాటుకున్న అర్షి ఖాన్.. తాను ప్రభాస్ సినిమాకు సైన్ చేశానని పేర్కొంటూ పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. కాకపోతే ఆ ట్విటర్ ఎకౌంట్ అర్షి ఖాన్ వెరిఫైడ్ ఎకౌంట్ అవునో కాదో అనే విషయంలోనే క్లారిటీ లేదనేది బాలీవుడ్ టాక్.


 



ఏదేమైతేనేం.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలామంది స్టార్స్, చిన్నాచితక సెలబ్రిటీలు కోరుకుంటున్నది మాత్రం ఒక్కటే!! బాహుబలి స్టార్ ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ వస్తే బాగుండునని. ప్రభాస్ సినిమాలో నటిస్తే అదే ఓ పెద్ద అవకాశం అవుతుందనేది వారి ఉద్దేశం.