Bigg Boss 15 Winner: బిగ్ బాస్ సీజన్ 15 విజేతగా తేజస్వి ప్రకాష్ నిలిచింది. 120 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ జర్నీలో ప్రేక్షకులను మెప్పించి.. వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ రన్నరప్ గా ప్రతీక్ సెహజ్ పాల్ నిలిచాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ బిగ్ బాస్ సీజన్ 15లో తేజస్వి ప్రకాష్ విజేతగా నిలిచి.. రూ.40 లక్షల నగదు బహుమతి గెలుచుకుంది. దీంతో పాటు ఏక్తా కపూర్ నిర్మిస్తున్న సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ నాగిన్ 6వ భాగంలో ప్రధానపాత్రలో నటించేందుకు ఎంపిక అయ్యింది తేజస్వి ప్రకాష్. 



ఈ బిగ్ బాస్ సీజన్ 15 ఫినాలేలో చివరిగా నలుగురు పోటీదారులు ఉండగా.. తొలుత షమితా శెట్టి ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత మూడో స్థానంలో కరణ్ కుంద్రా నిలిచి.. హౌస్ నుంచి నిష్క్రమించాడు. ఆ తర్వాత తొలిస్థానం కోసం సహా-పోటీదారుడు ప్రతీక్ సెహజ్ పాల్ తో పోటీపడి విజేతగా నిలిచింది తేజస్వి ప్రకాష్.  


Also Read: Malavika Mohanan Bikini: మాస్టర్ హీరోయిన్ మాళవిక మోహనన్ బికినీలో ఎలా ఉందో చూడండి!


Also Read: Khiladi: 'ఖిలాడి' విజయంపై ధీమా... దర్శకుడికి కోటి రూపాయల కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook