Khiladi: 'ఖిలాడి' విజయంపై ధీమా... దర్శకుడికి కోటి రూపాయల కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత..

Khiladi Movie: హీరో రవితేజ తాజా చిత్రం 'ఖిలాడి'. ఈ మూవీ విడుదలకు ముందే డైరెక్టర్​కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చారు ఆ చిత్ర నిర్మాత.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2022, 01:56 PM IST
  • రవితేజ కొత్త చిత్రం ఖిలాడి
  • ఫిబ్రవరి 11న విడుదల
  • దర్శకుడికి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత
Khiladi: 'ఖిలాడి' విజయంపై ధీమా... దర్శకుడికి కోటి రూపాయల కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత..

Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ(Raviteja) కొత్త సినిమా ‘ఖిలాడి’. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా పక్కాగా హిట్ అవుతోందని చిత్రబృందం ధీమాగా ఉంది. ​ ఈ క్రమంలోనే సినిమా రిలీజ్​కు ముందే డైరెక్టర్​ రమేశ్​వర్మకు అదిరిరపోయే గిఫ్ట్ ఇచ్చాడు నిర్మాత కోనేరు సత్యనారాయణ (Satyanarayana Koneru).

 రమేశ్ వర్మ...గతంలో ఒక ఊరిలో, ‘రైడ్’, ‘వీర’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు.  2019లో ‘రాక్షసుడు’ మూవీతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు రమేశ్ వర్మ. ​ ప్రస్తుతం రవితేజ ఖిలాడీ (Khiladi) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విజయంపై పూర్తి ధీమాతో ఉన్న నిర్మాత కోనేరు సత్యనారాయణ.. దాదాపు రూ.1.15 కోట్ల విలువైన రేంజ్​ రోవర్​ కారును రమేశ్​వర్మకు బహుమతిగా ఇచ్చారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటుడు అర్జున్ కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవీశ్రీ ప్రసాద్ (Music director Devisri Prasad) మ్యూజిక్ అందిస్తున్నాడు. రవితేజ ఇతర చిత్రాల విషయానికొస్తే.. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

Also Read: ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్లు తీసుకున్న సమంత.. సన్నీ లియోన్, కత్రినా కైఫ్ ఎంత వసూలు చేసారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News