బిగ్ బాస్ హౌజ్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. హౌజ్‌మేట్స్ ( BB4 Telugu contestants list ) సామర్ధ్యాలను పరీక్షించడానికి బిగ్ బాస్ కఠినమైన సవాళ్లను విసురుతున్నాడు. అందులో భాగంగానే బిగ్ బాస్ 4లో 'హేర్ కటింగ్' టాస్క్ ( Hair cut task in Bigg Boss Telugu 4 ) రానే వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైన ( Deepti Sunaina ), బిగ్ బాస్ సీజన్ 3లో శివ జ్యోతి ( Siva jyothi ) టాస్క్‌లో భాగంగా తమ జుట్టును కత్తిరించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మంగళవారం రోజు టెలీక్యాస్ట్ అయిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ 'డీల్ ఆర్ నో డీల్' టాస్క్‌ని ఇచ్చాడు. అందులో మొదటి టాస్క్‌గా 'ఒంటి మీద ఉన్న అన్ని దుస్తువులను ముక్కలు ముక్కలుగా కత్తిరించుకోవాలి' అని చెప్పగా కుమార్ సాయి ( BB4 Telugu contestant Kumar Sai ) తన ఒంటి మీద ఉన్న బట్టలను తీసి కత్తెరతో ముక్కలుగా కత్తిరించాడు. Also read : RRR movie: ఆర్ఆర్ఆర్ స్టోరీపై మరోసారి క్లారిటీ



బిగ్ బాస్ 'డీల్ ఆర్ నో డీల్'లో తదుపరి టాస్క్‌గా హౌజ్‌లోని ఒక అమ్మాయి తన జుట్టుని మెడపై వరకు కత్తిరించుకొని రెడ్ కలర్‌ని వేసుకోవాలి అని చెప్పాడు. ఆ టాస్క్‌ని కొంత భాదతో దేత్తడి హారిక ( BB4 Telugu contestant Dethadi Harika ) పూర్తి చేసింది. కొంత భాద ఎందుకు అంటే హారిక వాళ్ల అన్నయ్య బిగ్ బాస్‌లో జుట్టు మాత్రం కత్తిరించుకోవద్దు అని స్ట్రిక్ట్‌గా చెప్పాడంట.. కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మేరకు హారికకు జుట్టు కత్తిరించుకోవడం మాత్రం తప్పలేదు. జుట్టు కత్తిరించేటప్పుడు వాళ్ల అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినందుకు వాళ్ల అన్నయ్యకి 'సారి' చెపుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. Also read : Renu Desai tv entry: టెలివిజన్ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ


దేత్తడి హరిక ( Dethadi Harika hair cut task ) కొత్త లుక్ కొంత మంది ప్రేక్షకులకు నచ్చగా, మరి కొంత మంది బిగ్ బాస్‌లో ఇలాంటి టాస్క్‌లు ఏమిటి అని విస్తుపోతున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe