Renu Desai tv entry: టెలివిజన్ ఎంట్రీపై రేణు దేశాయ్ క్లారిటీ

ప్రముఖ సినీ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ( Renu Desai ) ఈ మధ్య జీ తెలుగు ఎంటర్టెయిన్మెంట్ లీగ్ 2020 లో పాల్గొంది. ఈ షోకి సంబంధించిన ఒక ప్రోమోని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ షో గత ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో టెలిక్యాస్ట్ అయింది. 'ఈ షోలో నేను పాట పాడటం, డ్యాన్సు వేయడం, కడుపుబ్బా నవ్వడం చూడొచ్చు' అని రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

Last Updated : Oct 14, 2020, 12:30 AM IST

ఈ పోస్టుకి ఒక అభిమాని స్పందిస్తూ.. 'టెలివిజన్ ఇండస్ట్రీలోకి స్వాగతం' అని కామెంట్ చేయగా.. ఆ కామెంట్‌కి రేణు దేశాయ్ స్పందిస్తూ 'ఈ షోకి కేవలం గెస్ట్ జడ్జిగా మాత్రమే వచ్చాను, ఏ సీరియల్‌కి సైన్ చేయలేదు' అని సమాధానం ఇచ్చింది. 'మీరు టీవీలో గెస్ట్ జడ్జిగా కనిపించినా చాలు మాకు' అని ఆ అభిమాని తెలిపారు. ఆ షోలో రేణు దేశాయ్ జాని సినిమాలోని 'ఈ రేయి తీయనిది' ( Ee reyi teeyanidi song ) అనే పాటతో ఎంట్రీ ఇచ్చింది.

కరోనా లాక్‌డౌన్ తరువాత తిరిగి టివి సీరియల్స్ ( Zee Telugu serials ) ప్రారంభించడానికి ముందు 'జీ తెలుగు వినోదానికి ఆహ్వానం' అనే క్యాంపెయిన్‌లో కూడా రేణు దేశాయ్ పాల్గొంది. ప్రస్తుతం రేణు దేశాయ్ డైరెక్టర్‌గా తెలుగులో అన్నదాతల ఇబ్బందులపై ( Farmers issues ) సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Trending News